రాగుల ఇడ్లీ

Spread the love

• రాగుల ఇడ్లీ
కావలసిన పదార్థాలు:

ఇడ్లీ పిండి – 2 కప్పులు

రాగి పిండి – అర కప్పు

వేడి నీళ్లు – పావు కప్పు

ఉప్పు – తగినంత

నూనె – సరిపడా
తయారీ విధానం:
నీళ్లు వేడి చేసి రాగి పిండి వేసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి.
ఈ పేస్ట్‌ను ఇడ్లీ పిండిలో వేసి కలపాలి.
15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచితే పిండి నీళ్లను పీల్చుకుంటుంది.
తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండితో నింపాలి.

Also READ:   కందిపప్పు పచ్చడి

ఇలా అన్ని ప్లేట్లు నింపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించాలి.
తర్వాత కుక్కర్‌లో ఇడ్లీ ప్లేట్లూ ఉంచి, ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి.
సాంబారు లేదా కొబ్బరి చట్నీతో వేడిగా వడ్డించాలి.

Updated: April 8, 2019 — 5:40 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *