రాజధాని తరలింపుని అడ్డుకోవడానికే సిద్దమైన టిడిపి..! – Pakka Filmy – Telugu

0
8


ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఇప్పటికే పోరాటాన్ని ఉధృతం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై చంద్రబాబు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ బేటీ ఆదివారం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, అనుసరించాల్సిన వ్యూహం ఏంటీ అనే దానిపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

Also READ:   Prabhas Latest News About His House

ఇప్పటికే తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చంద్రబాబు విప్ కూడా జారీ చేశారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నాసరే రాజధాని రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే విధంగా చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సిఆర్దియే రద్దు బిల్లుని అడ్డుకునే విధంగా కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇవ్వడంపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

Also READ:   వెన్నుపోటు చరిత్ర జగన్‌దే.. టీడీపీ ఎమ్మెల్సీ లాజిక్ ఇదీ..

ఇదిలా ఉంటే టిడిపి సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని సమావేశానికి రాలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్తున్నారు. అయితే సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తప్పకుండా వస్తాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే వీరిలో గంటా శ్రీనివాసరావు బీజేపీ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన రాలేదని సమాచారం.

The post రాజధాని తరలింపుని అడ్డుకోవడానికే సిద్దమైన టిడిపి..! appeared first on Pakka Filmy – Telugu.