రికార్డులు శాశ్వతం కాదు.. ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్.. నా కంచుకోట అదే.. అల్లు అర్జున్

0
6

Please View My Other Sites


నా కంచుకోట అదే

నా కంచుకోట అదే

నా ఫస్ట్ సినిమా షూటింగ్ వైజాగ్‌లోనే జరిగింది. చాలా సినిమాలు వైజాగ్‌లోనే జరిగింది. నాకు బాగా నచ్చిన ప్రదేశం కూడా ఇదే. ప్రతీ ఒక్కరికి ఓ కంచుకోట ఉంటుంది. నాకు మాత్రం వైజాగ్ కంచుకోట అని అందరూ అంటున్నారు. కలెక్షన్లు కూడా అదే నిరూపిస్తున్నాయి. అందుకే నా మొట్టమొదటి థ్యాంక్యూ తెలుగు ప్రేక్షకులకు చెబుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

మంచి సినిమా వస్తే

మంచి సినిమా వస్తే

సినిమాకు టెలివిజన్, మొబైల్, ఇతర ప్రసార సాధనాలతో పోటీ పెరిగింది. థియేటర్‌కు ప్రేక్షకులు రావడం లేదనే సమయంలో అల వైకుంఠపురంలో వచ్చింది. మంచి కథ, మంచి సినిమా వస్తే థియేటర్‌కు వచ్చి చూస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

Also READ:   బ్రేకింగ్: RRR వాయిదా.. రాజమౌళి షాకింగ్ నిర్ణయం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?
-->

తమన్‌కు థ్యాంక్స్

తమన్‌కు థ్యాంక్స్

తమన్‌కు నా థాంక్స్. ఎందుకంటే సినిమాకు ముందు ఎలాంటి మ్యూజిక్ కావాలంటే.. వన్ బిలియన్ వ్యూస్ వచ్చే ఆడియో కావాలని అడిగాను. నేను అడిగినట్టే నాకు అలాంటి ఆల్బమ్‌ను అందించాడు. సామజవరగమన, రాములో రాములా, ఓ మై డాడీ, బుట్టబొమ్మ పాటలతో గొప్ప ఆడియో ఆల్బమ్‌ను అందించారు. నాకు ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

త్రివిక్రమ్ గొప్ప పెయింటర్ లాంటి వాడు
Also READ:   பானுபிரியா யாருடைய அக்கா தெரியுமா ? | Tamil Cinema News | TAMIL NEWS | Tamil Rockers | Kollywood

త్రివిక్రమ్ గొప్ప పెయింటర్ లాంటి వాడు

అల వైకుంఠపురంలో ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నాతోపాటు ఎంతో మంది నటీనటులు నటించారు. వీరందరికీ హిట్టు ఇచ్చింది దర్శకుడు త్రివిక్రమ్. సినిమాను ఓ పెయింటింగ్‌గా అందంగా తీర్చిదిద్దిన కళాకారుడు లాంటి వ్యక్తి త్రివిక్రమ్. గత సినిమాలు రిలీజ్ అయినప్పుడు డ్యాన్సులు బాగా చేశావని.. ఫైట్లు బాగా చేశావని చెప్పేవాళ్లు. కానీ ఈ సినిమా తర్వాత బాగా ఫెర్ఫార్మెన్స్ చేశావని అంటున్నారు. అందంతా త్రివిక్రమ్ వల్లే అని అల్లు అర్జున్ తెలిపారు.

గత పదేళ్లలో

గత పదేళ్లలో

గత దశాబ్దంలో నేను చేసిన సినిమాలు చూస్తే నాకు సంతృప్తి కలుగలేదు. గొప్ప సినిమాలు చేయలేకపోయాను. అందుకే మంచి సినిమాలు చేయాలని అనుకొన్నాను. 2020లోనే మంచి సినిమా అల వైకుంఠపురంలో వచ్చింది. ఇలాంటి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. గర్వించ దగిన స్థానానికి వెళ్లేలా.. మిమ్మల్ని తీసుకెళ్లేలా నేను ఉంటానని మాటిస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

Also READ:   దర్బార్ డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. రక్షణ కల్పించమని కోర్టును ఆశ్రయించిన దర్శకుడు
-->

Allu Arjun Excellent Speech At Ala Vaikunthapurramloo Success Meet

రికార్డులు శాశ్వతం కాదు..

రికార్డులు శాశ్వతం కాదు..

అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్‌గా మారిపోతున్నది. ప్రతీ హీరో ఎదో ఒక సమయంలో పెద్ద హిట్టు, రికార్డులు క్రియేట్ చేశారు. రికార్డులనేవి ఈ రోజు నేను క్రియేట్ చేయొచ్చు. కొద్ది రోజుల తర్వాత మరోకరు బ్రేక్ చేయవచ్చు. కానీ ఓ సినిమా చూసినప్పుడు గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అదే శాశ్వతం. రికార్డులన్నీ టెంపరరీ. మీ మనసులో ఇచ్చిన స్థానం శాశ్వతం. దానిని విలువ కట్టలేం అని అల్లు అర్జున్ చెప్పారు.