రోజుకు రూ.160తో చేతికి ఏకంగా రూ.30 లక్షలు.. సుకన్య సమృద్ధి స్కీమ్‌‌తో అదిరిపోయే లాభం!

0
36


Samayam Telugu | Updated:

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. పాపులర్ స్కీమ్స్‌లలో ఇది కూడా ఒకటి. ఆడ పిల్లల ఆర్థిక భద్రత ఈ స్కీమ్ అసలు లక్ష్యం. ఇంట్లో ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరి వారి పేరుపై డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.

బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా బెస్ట్

ఆడ పిల్ల పుట్టగానే చాలా మంది తన పేరుపై చిన్నప్పుడే కొంత మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయి పేరుపై బ్యాంక్‌లో కాకుండా సుకన్య సమృద్ధి స్కీమ్‌లో ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి పొందొచ్చు. మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.

Also Read: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి పతనం!

బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో

ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్‌ను తెరవొచ్చు. దగ్గరిలోని బ్యాంక్ లేదంటే పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఈ ఖాతా ప్రారంభించొచ్చు. దేనిలోనైనా ఒకే వడ్డీ లభిస్తుంది. ఆడ పిల్లలకు 10 ఏళ్లు వచ్చే లోపు ఈ పథకంలో చేరాలి. ఈ వయసు దాటితే స్కీమ్‌లో చేరడం కుదరదు. బర్త్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

Also READ:   పత్రికా విలువలు దిగజారుస్తున్న సాక్షి కథనాలపై భారతికి వర్ల రామయ్య బహిరంగ లేఖ..! - Pakka Filmy - Telugu

Also Read: ఇప్పటికే ఈ స్కీమ్‌లో కోటి మందికి పైగా చేరారు.. మీరు చేరండి.. నెలకు రూ.200తో రూ.5,000 పొందొచ్చు!

21 ఏళ్లు ఆగాల్సిందే..

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి సుకన్య సమృద్ధి అకౌంట్ 21 ఏళ్లు కొనసాగుతుంది. అమ్మాయి వయసుతో ఇక్కడ పని లేదు. 21 ఏళ్ల తర్వాతనే మీరు మీ డబ్బును వెనక్కి తీసుకోవడం వీలవుతుంది.

Also Read: కొత్త ఆధార్ కార్డులొచ్చాయ్.. సరికొత్త రంగులో.. వారికి మాత్రమే..

15 ఏళ్లు డిపాజిట్ చేస్తే చాలు

సుకన్య సమృద్ధి అకౌంట్‌లో 15 ఏళ్ల పాటు డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. అటుపైన డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ ఖాతాలోని డబ్బుపై 21 ఏళ్ల మెచ్యూరిటీ వరకు వడ్డీ లభిస్తుంది. దీంతో మీకు ప్రయోజనం లభిస్తుంది.

Also Read: ఉద్యోగి మరణిస్తే వారి PF అకౌంట్ డబ్బులు ఏమౌతాయి? వాటిని ఎవరు విత్‌డ్రా చేసుకోవచ్చు? పూర్తి వివరాలు!

ముందుగా కూడా డబ్బు తీసుకోవచ్చు

సాధారణంగా అకౌంట్ నుంచి 21 ఏళ్ల తర్వాతనే డబ్బులు తీసుకోవడం వీలవుతుంది. ముందుగా కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి పెళ్లి, ఉన్నత చదువు వంటి వాటి కోసం ఈ డబ్బు వినియోగించాలి. పెళ్లి కోసం డబ్బు తీసుకోవాలని భావిస్తే మీ అమ్మాయికి 18 ఏళ్లు దాటి ఉండాలి.

Also READ:   AAJTAK LIVE:INDIAN AIR FORCE की SURGICAL STRIKE...PAKISTAN ने की LOC पर FIRING शुरु | Dilli Tak

Also Read: వామ్మో.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి!

Please View My Other Sites

8.4 శాతం వడ్డీ

సుకన్య సమృద్ది అకౌంట్‌పై 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మార్చి చివరి వరకు ఇదే వడ్డీ ఉంటుంది. తర్వాత ఈ వడ్డీ రేటు తగ్గొచ్చనే అంచనాలున్నాయి. కాగా ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును సవరిస్తూ ఉంటుంది. పెంచొచ్చు.. లేదంటే తగ్గించొచ్చు. రెండు కాకపోతే స్థిరంగా కూడా ఉండొచ్చు.

Also Read: SBIలో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే!

రూ.1.5 లక్షల వరకు

ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెలకు కనీసం రూ.1,000 డిపాజిట్ చేసుకోవచ్చు.

Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. IRCTC వేకప్ కాల్ సర్వీస్ గురించి మీకు తెలుసా? దీంతో 2 అదిరిపోయే లాభాలు!

Also READ:   ভোলা ১ আসনে প্রার্থী যারা। Election News

రూ.5000తో రూ.30 లక్షలు

మీరు రోజుకు రూ.35 ఆదా చేస్తే నెలకు రూ.1,050 అవుతుంది. దీన్ని సుకన్య అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.5 లక్షలకు పైగా పొందొచ్చు. అదే మీరు రోజుకు రూ.400 పొదుపు చేస్తూ.. నెల చివరిలో ఆ మొత్తాన్ని సుకన్య ఖాతాలో జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.75 లక్షలు పొందొచ్చు. నెలకు రూ.5,000 డిపాజిట్ చేస్తే.. రూ.30 లక్షలకు పైగా లభిస్తుంది. వడ్డీ రేటు మారే ఛాన్స్ ఉండటంతో ఈ మొత్తంలో అటుఇటుగా కొంత వ్యత్యాసం ఉండొచ్చు.

Also Read: Valentines Day Offer.. రూ.999కే విమాన టికెట్!

పన్ను మినహాయింపు

ఎస్ఎస్‌వై స్కీమ్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బు, దీనిపై వచ్చిన వడ్డీ, చివరిలో తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. దీంతో పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం లభిస్తుంది.

Also Read: రూ.25 లక్షల వరకు రుణం.. 35 శాతం సబ్సిడీ.. కేంద్రం అదిరిపోయే స్కీమ్!

పాప మరణిస్తే?

ఒకవేళ సుకన్య సమృద్ధి ఖాతా కలిగిన ఆడ పిల్ల మరణిస్తే.. అప్పుడు అకౌంట్ వెంటనే క్లోజ్ అవుతుంది. పాప డెత్ సర్టిఫికెట్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు అందజేయాల్సి ఉంటుంది. అటుపైన అకౌంట్లోని డబ్బులు వెనక్కి ఇస్తారు.

Also Read: నెలకు రూ.5,000తో చేతికి ఏకంగా రూ.11 లక్షలు.. ఇలా చేయండి!LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here