లక్ష్మీదేవి నామస్మరణ చేస్తే చాలు

0
108

1??ఓం శ్రీమాత్ర్యే నమః ??

లక్ష్మీదేవి నామస్మరణ చేస్తే చాలు
ధనధాన్యాలతో ఏ ఇల్లైనా కళకళలాడుతూ ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. ఏ ఇంటనైనా సిరిసంపదలు నాట్యం చేయాలంటే ఆ ఇంటివైపు లక్ష్మీదేవి కన్నెత్తి చూడాలి. అమ్మవారు కరుణించి కాలుపెడితే అంతా ఐశ్వర్యమే … ఆనందమే. లక్ష్మీదేవి కరుణామృతాన్ని అందుకోవాలంటే భక్తిశ్రద్ధలు ఎంతో అవసరం.
అనునిత్యం అంకితభావంతో లక్ష్మీదేవిని సేవించడం వలన ఆమె కరుణాకటాక్ష వీక్షణాలు తప్పక లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అభిషేకించి గులాబీలతో పూజించడం వలన ఆమె ప్రీతి చెందుతుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ వుండటం వలన కూడా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
అనునిత్యం లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తూ వుండటం వలన, అలాంటివాళ్లను విడచివెళ్లకుండా ఆమె స్థిరనివాసం చేస్తుంది. సాధారణంగా లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుందనీ, అందువలన ఒకచోట కుదురుగా ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుందని అనుకుంటూ వుంటారు. నిజానికి లక్ష్మీదేవి స్వభావం అది కానేకాదు.
ధర్మబద్ధమైన … పవిత్రమైన జీవన విధానాన్ని చూసి, సంప్రదాయబద్ధమైన పద్ధతులను చూసి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. ఏవైతే మంచి లక్షణాలను చూసి అమ్మవారు అక్కడ ఉందామని అడుగుపెడుతుందో, ఆ తరువాత ఆ ఇంట్లోని వ్యక్తులు అమ్మవారికి ఇబ్బంది కలిగించేలా ఆ లక్షణాలను మార్చుకున్నప్పుడు సహజంగానే ఆమె ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోతుంది.

Also READ:   బోనాలు

శ్రీ లక్ష్మి దేవి నమః శ్రీ మహాలక్ష్మిదేవి దీవెనలు మన అందరికీ వుండాలని కోరుతూ శుభోదయం ఫ్రెండ్స్