లాస్ట్ పంచ్? మనదైతే ఆకిక్కే వేరప్పా??

లాస్ట్ పంచ్? మనదైతే ఆకిక్కే వేరప్పా??

స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..
ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు…!!
.
ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..

వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా…
.
ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!
” పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి”
.
దానికి వివేకానందుడు..!!
ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :
” మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా” అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.
(1St Punch?)
.
ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది…!!
ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!
.
ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో…
వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు…!!
“వివేకానందా..!!
నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..
నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం…!!
ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?”
.
వివేకానందుడు (సందేహించకుండా)…
“అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను” ఆన్నారు..!!
.
ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..
“అనుకున్నా…నీ సమాదానం అదేనని…!!
నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా” అన్నాడు..!!
.
దానికి వివేకానందుడు..!!
” నిజమే. … సహజంగా…. ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!”
(2nd Punch?)
.
ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!
అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు…
వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!
.
టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి…!!
ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!
.
కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..
వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!
.
ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద…
తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన ” ఈడియట్” అనే Word చూసి…తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది
కోపం తగ్గిన తరువాత హుందాగా..
ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి…
గౌరవప్రదంగా…
వినమ్రమయిన శాంత స్వరంతో…
“సర్…!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు… (లాస్ట్ పంచ్?)

?????that is. Vivekananda

Related:   వస్తువు విలువ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *