వరం

Spread the love

?????
సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.
ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు…

అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి…

భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై…

“ఓ స్త్రీ… నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే… అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.

అందుకు…ఆమె సంతోషించి, “స్వామి… నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు” అనడిగింది.

Also READ:   ఛి_ఛి_ఈ_లేడీస్_ఉన్నారే_బాగా_ముదుర్లు

దేవుడు, “తధాస్తూ… మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది” అని చెప్పి వరమిచ్చాడు.

సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. ” 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ ” అంది.

దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు “నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో… బాగా డబ్బు వచ్చాక…. నిన్ను పట్టించుకోడేమో” అన్నాడు.

“అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి” అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.

Also READ:   ఒకతను Dec 31st న  నిన్న అర్దరాత్రి తాగి ఇంటికొచ్చి డోర్ కొడుతున్నాడు

అందుకామె నెమ్మదిగా చెప్పింది… “స్వామీ…. ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి…” అంది.

దేవుడు……. కెవ్వుమన్నాడు………!
!!!!**!!!!!

Updated: July 12, 2019 — 3:58 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *