విజయ్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసిన సినిమా.. వరల్డ్ ఫేమస్ లవర్ మినీ రివ్యూ..!! – Pakka Filmy – Telugu

0
32


అర్జున్ రెడ్డితో స్టార్ హీరో రేంజ్‌ను సంపాదించుకొన్న యువ హీరో విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస విజయాలు సొంతం చేసుకొన్నారు. తన కెరీర్‌లో 9వ చిత్రంగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇదే తన చివరి ప్రేమకథా చిత్రమని వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్‌లో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరి ప్రేమికుల రోజున వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రమ్ గురించి ట్విటర్‌లో ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టిక్కెట్ ధరలు పెంచినప్పటికీ బుకింగ్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓపెనింగ్ డే అన్ని ఏరియాల్లో థియేటర్లు నిండిపోతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఆల్‌మోస్ట్ థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు సుమారు 500 షోలు పడుతుండగా ఇప్పటికే 400కు పైగా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also READ:   నాగబాబుపై రోజా పై చేయి.. డైలమాలో పడిపోయిన మెగా బ్రదర్..– News18 Telugu

Please View My Other Sites

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్న వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్టాఫ్‌పై పాజిటివ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ అదిరిపోయిందని కొంతమంది అంటున్నారు.. విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ పర్ఫెక్ట్ బేస్‌ను ఏర్పరిచారట. సెకండాఫ్ అదే స్థాయిలో ఉందట..

Also READ:   Pawan kalyan: పవర్‌స్టార్ సినిమాపై గాసిప్స్.. ఒకటి నిజమైంది!

క్యారెక్టర్ల డిజైన్ బాగుంది.. మొత్తం మీద సినిమా అయితే బాగుంది అంటున్నారు.. ఎక్కువ మంది విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్‌పైనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్, యామిని సీన్స్ ఫస్టాఫ్‌కు బలం అంటున్నారు. ఇక కథ చాలా ఎమోషనల్‌గా సాగే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కొత్తగూడెం ఎపిసోడ్ సినిమా హైలెట్లలో ఒకటని చెప్పకొంటున్నారు. విజయ్ దేవరకొండ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హెయిర్ స్టయిల్‌ను మెయింటెన్ చేశారు. మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను అలరించేలా గెటప్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also READ:   News Updates

The post విజయ్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసిన సినిమా.. వరల్డ్ ఫేమస్ లవర్ మినీ రివ్యూ..!! appeared first on Pakka Filmy – Telugu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here