వెజిటబుల్ రైస్

వెజిటబుల్ రైస్.

కావలసినవి .

బియ్యము — ఒక గ్లాసు .
క్యారెట్లు — 2
క్యాప్సికమ్ — 2
ఉల్లిపాయలు — 2
బీన్స్ — 100 గ్రాములు. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
నెయ్యి — మూడు స్పూన్లు .
జీడిపప్పు — 10

పొడికి .

నెయ్యి — రెండు స్పూన్లు .
ఎండుమిర్చి – 5
మినపప్పు — స్పూను
శనగపప్పు — స్పూను
వేరు శనగ గుళ్ళు – రెండు స్పూన్లు
నువ్వుపప్పు — రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి — పావు చిప్ప చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఉప్పు — తగినంత

Related:   చెన్నూర్‌ కోడి పులావ్‌

స్టౌ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా తీసి ఉంచుకోవాలి .
తర్వాత పై దినుసులన్నీ వేసి వేయించుకుని , సరిపడా ఉప్పు వేసి మిక్సీ లో మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టుకుని ఉంచుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా గ్లాసు బియ్యము సరిపడా
నీళ్ళు పోసి కుక్కర్ లో పొడిగా వండుకోవాలి .

వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే , ముందుగా ఉల్లిపాయలు , క్యారెట్ ముక్కలు , క్యాప్సికమ్ ముక్కలు , బీన్స్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పువేసి మూతపెట్టి ముక్కలను పది నిముషాలు మెత్తగా మగ్గ నివ్వాలి.

Related:   చింతకాయ, పచ్చిమిర్చి

తర్వాత అందులో ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అన్నం వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న పొడి నాలుగు స్పూన్లు వేసుకుని మరో మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకుని పైన నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుని వేరే డిష్ లోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ రైస్ సర్వింగ్ కు సిద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *