వేరే ఇంట్లో ఉంటున్న చరణ్.. ఎందుకు ? – Adya News


Mega Power Star Ram Charan New House

తెలుగు ఇండస్ట్రీలో ఉమ్మడి కుటుంబాలు కాస్త తక్కువనే చెప్పాలి. కానీ కొన్ని పెద్ద కుటుంబాలు ఇప్పటికి కలిసే ఉంటున్నాయి. వారిలో మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా కలిసే ఉంటుంది. ఉపాసనతో పెళ్లి అయిన తర్వాత కూడా రామ్ చరణ్ తల్లిదండ్రులతోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా వేరే ఇంటికి మారిపోయినట్లు సమాచారం.

భార్యతో కలిసి పెద్ద ఇల్లు తీసుకుని విడిగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిరు ఉన్న ఇంటిని తన టెస్ట్ కు తగ్గట్లుగా చరణ్ మార్పులు చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి ఆ ఇంట్లో ఉండటం లేదంట. దానికి సమీపంలోనే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరో ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాసన – చరణ్ ఇప్పుడు ఆ ఇంట్లోనే వేరుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సరైన ఫ్రూప్స్ లేవు కానీ.. జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టే సమయంలో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఇంటి బయటకి వచ్చి క్లాప్స్ కొట్టారు.

READ:   Lesbian Interest Movies With an Indian Flavor

అందులో ఆయన తల్లితో పాటు చెల్లెల్లు బావలు పిల్లలు.. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఉన్నారు.. కానీ రామ్ చరణ్ దంపతులు మాత్రం లేరు. వాళ్లిద్దరూ లేరన్న విషయంలో ప్రతి ఒక్కరికీ డౌట్ వచ్చింది. అంతేకాకుండా అదే టైంలో చరణ్, ఉపసన వేరే ఇంటి బయటకి వచ్చి బాల్కనీ నుంచి చప్పట్లు కొట్టారు. ఆ టైంలో అక్కడ వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరూ లేరు. దాంతో చిరంజీవి రామ్ చరణ్ ఇప్పుడు వేరు వేరు ఇళ్ళల్లో ఉన్నారనే విషయం స్పష్టమైపోయింది.

READ:   Indian Premier League - Karmic Cricket

నిజానికి టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగచైతన్య మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ మంచు విష్ణు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా తమ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు చరణ్ కూడా ఇదే చేశాడు. అయితే దూరంగా ఉన్నాడనే కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తండ్రి ఇంటికి భార్యతో సహా వెళ్లి వస్తుంటాడంట చరణ్. ప్రవసీ కోసం మాత్రమే వేరే ఇంట్లో ఉంటున్నట్లు.. మరె ఇతరకారణం లేదని సమాచారం.

READ:   Current Affairs Quiz: 3 March 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *