వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు

0
106

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు –
×××××××××××××××××××××

ప్రియమితృలకు,

ఇప్పుడు నేను చెప్పబోయే పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

* ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు –

పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .

* మొటిమలు మరియు కాలిన బొబ్బలకు –

క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).

* గాస్ట్రిక్ సమస్య కొరకు –

తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల
మోతాదుగా తాగవలెను .

* గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు

క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .

* గుండె సమస్యల కొరకు –

క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.

* మూలవ్యాది కొరకు –

క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను .

* అజీర్ణ వ్యాధి కొరకు –

క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .

* ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు –

తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .

* నిద్రసరిగ్గా పట్టనందుకు –

పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .

Also READ:   Truth About Hypnosis

* మూత్రపిండాల బాధల కొరకు –

క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .

* కాలేయ సమస్యల కొరకు –

క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ
రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .

* నరాల బాధల కొరకు –

తోటకూర మరియు లెట్యూస్ పచ్చి రసాలని తాగవలెను .

* అధిక బరువు తగ్గించుట కొరకు –

తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .

* హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు –

క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .

* క్షయ వ్యాధి నివారణ కొరకు –

పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .

* అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు –

Also READ:   నోటి పూత

క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను

* సిరలకు సంబందించిన వ్యాధి కొరకు –

క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .

* ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు

టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .

* రక్తహీనత కొరకు –

క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .

* సంధివాతం –

తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను .

* ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ కొరకు –

ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి .

మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు .

* కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు –

క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి .

* రక్తప్రవాహంలోని దోషాల కొరకు –

క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి .

* మలబద్దకం సమస్య నివారణ కొరకు –

క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను .

* మధుమేహము కొరకు –

Also READ:   నోటిపూత తగ్గేందుకు పవర్‌ఫుల్ చిట్కాలు

తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి .

* చర్మవ్యాధులు కొరకు –

క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి .

* కంటిజబ్బులు –

క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను .

* మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు –

క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను .

గమనిక –

పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.

Please View My Other Sites

మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం ౧౮౦ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water kres రసములను మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here