Home Bhakti శ్రీ ఐరావతేశ్వర దేవాలయం | Shri Airavatesvara Temple Darasuram Tamil Nadu

శ్రీ ఐరావతేశ్వర దేవాలయం | Shri Airavatesvara Temple Darasuram Tamil Nadu

- Advertisement -




శ్రీ ఐరావతేశ్వర దేవాలయం తమిళనాడు లో ప్రసిద్ధ శివాలయం . ఈ ఆలయాన్ని  12వ శతాబ్దం లో రాజరాజ చోళుడు II నిర్మించాడు.  తమిళనాడు లో యునెస్కో వారు గుర్తించిన వాటిలో శ్రీ ఐరావతేశ్వర దేవాలయం ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి 4 కిమీ దూరం లో కలదు . ఈ ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం  ద్రావిడ నిర్మాణ శైలి కలిగుంది . 

ఆలయ స్థలపురాణం ప్రకారం :
ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయంలో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. .

పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. ఈ కారణంగా ఈ సరస్సును “యమ తీర్థం” అని పిలుస్తారు.

మెట్లను తాకితే సప్త స్వరాలు : 

అంతర్భాగంలో తూర్పు వైపు చెక్కబడిన నిర్మాణాల సముదాయం కలిగి ఉంది. వాటిలో “బలిపీఠం” ఉంది. దాని పీఠములో చిన్న గణేషుని విగ్రహం కలిగి ఉంది. ఈ బలిపీఠం యొక్క పీఠములో దక్షిణ భాగంలో మూడు అందముగా చెక్కబదిన మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తాకినపుడు సంగీతంలోని సప్తస్వరాల శబ్డం వినబడుతుంది. 
Keywords : 
Airavatesvara Temple, Airavateshwar temple tamil nadu, airavateswar temple route, airavateswara temple information in telugu. 

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....

Leaky Gut Cure – Fastest Way to Cure Leaky Gut Syndrome

Product Name: Leaky Gut Cure - Fastest Way to Cure Leaky Gut Syndrome Click here to get Leaky Gut Cure - Fastest Way to Cure...

Related News

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....

Leaky Gut Cure – Fastest Way to Cure Leaky Gut Syndrome

Product Name: Leaky Gut Cure - Fastest Way to Cure Leaky Gut Syndrome Click here to get Leaky Gut Cure - Fastest Way to Cure...

బిసిబేళాబాత్‌

• బిసిబేళాబాత్‌ కావాల్సినవి   బియ్యం - ఒక కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, మునగకాయ - ఒకటి, బీన్స్‌ - పది, క్యారెట్‌ - రెండు,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here