శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు (సద్గురు శ్రీ శివానందమూర్తిగారి ప్రవచనములనుండి సేకరించినవి)

శ్రీ కృష్ణతత్త్వ విశేషాలు

1

మనకు వేదాలు ప్రమాణం.ఈ యుగ ప్రారంభంలోవ్యాసుడు వేదరాశిని నాలుగుగా విభజించినలుగురు శిష్యులకు వాటి సంరక్షణకై ఈ నాలుగుభాగాలు ఇచ్చాడు.  వేదంలో భాగాలు సంహిత,బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.ఉపనిషత్తులను వేదం చివరచేర్చడం వలన అవివేదాంతము అనిపిలువబడతాయి. ఈఉపనిషత్తులసారాన్ని 18 అధ్యాయాలలొసుమారు  700 శ్లోకాలుగా మనకై ఇచ్చినవాడుశ్రీకృష్ణుడు. అర్జునుని వ్యాజంతో మనందరికీబోధించిన గురువయ్యాడు. అందుకే భగవద్గీతనుగీతోపనిషత్ అంటారు. వేదాలుఅర్థంచేసుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్నివేదాంగాలు అంటారు. ఇవి వ్యాకరణం, జ్యోతిషం,నిరుక్తం, కల్పం,శిక్ష,ఛందస్సు. వేదంలోనివిషయాలను కథలలో చెప్పేవిపురాణాలు.ముఖ్యమైనవి 18. ఇవీవ్యాసుడేసామాన్యులకై చెప్పాడు.  సాంఖ్యం,యోగం. మీమాంస, వేదాంతం – ఈ ఆరూ ఆస్తికదర్శనాలు. వ్యాసుడు పైలుడికి ఋగ్వేదము,వైశంపాయనుడికి యజుర్వేదం, జైమినికిసామవేదం, సుమంతునికి  అథర్వ వేదం ఇచ్చాడు.రోమహర్షణునికి పురాణాలు ఇచ్చాడు. ఈయనసూతుడనే పేరుతో  తరువాత కాలంలోనైమిశారణ్యంలోశౌనకాది మహర్షులకు పురాణప్రవచనాలు ఇచ్చారు

2

శ్రీకృష్ణుడు మనకి బాగాతెలిసినదైవం.  భగవంతుడేమానవునిగా వచ్చాడు. ఈ కలియుగంఆరంభంలోనే 5000 సం. ముందు వచ్చాడు.మనకుఆయనను గురించి తెలుసు అనుకుంటాము. కానిఆయన తత్త్వం మనకు తెలియదు. వ్రేపల్లెలోలీలలు,బృందావనంలో ఆటలు, రాసక్రీడలు,16000గోపికలు, రాధ – అంతే మనకు తెలిసినది. ఆయన125సం.దీర్ఘ  జీవితంలో ఇవి కేవలం మొదటి 12సంవత్సరాల విశేషాలు. ఆయనను అపార్థంచేసుకోవడమే మనకు అర్థమైనది. జారుడు,వెన్నదొంగ, మానినీచిత్తచోరుడు — ఇవి మనంఆయనకు ఇచ్చిన బిరుదులు. వీని పరమార్థమూమనకు తెలియదు. సద్గురుబోధనుండి సేకరించినవి- తెలియవచ్చినంత తేట పరతు.

3

అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం,మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితేఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలోఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలుఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం – అని వ్యాసుడుఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులుచెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు,శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువుదశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అదికృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?

4

కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటేమత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గలఅవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూపరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే,రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలోరాక్షసులూకూడా తపస్సులుచేసిలోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తినిపరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికిఅటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం,కౄరత్వం,అధర్మం చాలామందిలో ప్రవేశించింది.కంస, జరాసంధ, శిశుపాలాదులు  కృష్ణునిబంధువులే. అజ్ఞానంకూడా అనేకంగావ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాలవ్యవహారం. పైగా అదియుగాంతం. సమాజప్రక్షాళన అతడి కార్యక్రమమైనది. రాక్షససంహారము విష్ణుతత్త్వమైతే అనేక ఇతరదేవతలఅంశలను కూడా తీసుకుని కృష్ణుడు వచ్చాడు. ఈకృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి,శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతలసంగమం ఆయన.

5

శ్రీకృష్ణుడు అంటేనే యోగం గుర్తుకు వస్తుంది.ఆయన మహాయోగి, యోగీశ్వరుడు,యోగీశ్వరేశ్వరుడు. భగవద్గీతలో ప్రతి అధ్యాయంఒక యోగమే. యోగ అన్నపదానికి అర్థం రెంటినికలుపుట. సంయోగం కలయిక, ఐతే వియోగంవిడిపోవడం. “యోగక్షేమం వహామ్యహం”అంటాడు పరమాత్మ. యోగమంటే లేనిదిలభించడం, క్షేమమంటే ఉన్నది నిలబడడం. గీతలోయోగం అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యంచేయడం. దీనికి అనేక దర్శనాలు అనేక మార్గాలు.వాటన్నిటినీ సమన్వయంచేసి గీతలోచెప్పినవాడుభగవంతుడు. గీత వృద్ధులకు పనికి వచ్చేపుస్తకమా? కానేకాదు. నిత్యజీవితంలో ఎదురయ్యేప్రతి సంఘర్షణకు మార్గం చూపిస్తుంది. దానినిమించిన Management Textbook లేదు.

6

వసుదేవసుతందేవం కంసచాణూర మర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం

మనము కృష్ణుడు మహాయోగిఅనిచెప్పుకున్నాము. అసలు ఆయనముఖ్యతత్త్వం జగద్గురు తత్త్వం.ఇది విష్ణుతత్త్వంకాదు. విష్ణువు ఏ అవతారంలోనూ ఎవరికీ బోధచేయలేదు. ఇది కృష్ణునిలోని శివ  తత్త్వం,సుబ్రహ్మణ్య తత్త్వం. కృష్ణునికి శివునికీ ఉన్నసంబంధం మామూలుగా గుర్తించనిది.  భీష్ముడుధర్మరాజు కు విష్ణు సహస్రం బోధించాడు. కృష్ణుడుధర్మరాజుకు శివసహస్రనామావళి, శివ పూజాప్రాశస్త్యం బోధించాడు. ప్రభాస తీర్థంలో (సోమనాథక్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించాడు.అర్జునుని శివునికై తపస్సుచేసి  పాశుపతంపొందమని చెప్పాడు. శివుని బోధరూపందక్షిణామూర్తి. సుబ్రహ్మణ్యుని  శివగురువుఅంటారు. ఆయన వాహనం నెమలి. అందుకేకృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత,ఉత్తర గీత, ఉద్ధవ గీతలు. భ్రమర గీత కూడా.కృష్ణుని భంగిమ నటరాజ స్వామి కుంచితపాదాన్నిపోలి ఉంటుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడువంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు(శివసహస్రంలో ఒకపేరు).

7

ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకోవాలి. పురాణాలుఐదు లక్షణాలు కలిగి ఉంటాయి  .సర్గ, ప్రతిసర్గ,మన్వంతరం, వంశం, వంశానుచరితం. – అనంతకాల చక్రం ఆద్యంతాలులేనిది.మానవజీవితమునకు సుమారు 100 సంవత్సరాలుపరిమితి అయితే,  కలియుగ పరిమితి 4,32,000సం. 4:3:2:1 లొ ఉన్న నాలుగు యుగాలు ఒకమహాయుగం. ఎన్నో మహాయుగాలు గడిస్తే కల్పం,మన్వంతరం వంటివి వస్తాయి. యుగాంతం లోప్రళయాలు  వస్తాయి. విష్ణువు పాలసముద్రంలోఆది శేషునిపై  యోగనిద్రలో ఉంటాడు. ఆతడే సృష్టికర్త.   ఆధునికులం  పాలసముద్రాన్ని Milky Way Galaxy గా భావించుకోవచ్చు. ఆయన సృష్టికోసం   ఒక పరిమిత విశ్వాన్ని  సృష్టించాడు.ఆది బ్రహ్మాండము.  దీనిలో భూమితొ సహా భూ,భువ, సువ, మహ, జన, తప, సత్య – అనే 7ఊర్ధ్వలోకాలు , అతల, వితల, …. పాతాళ అనే 7క్రిందిలోకాలు సృష్టించాడు. సత్యలోకములోప్రతిసృష్టిచేసే  బ్రహ్మదేవుణ్ణి సృష్టింఛాడు. ఈబ్రహ్మలోకంపైన పరమేశ్వర లోకాలనే వైకుంఠం,కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడలక్ష్మీనారాయణులు, శివపార్వతులూ,రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వారి లోకాలలోఉంటారు.

8

పంచబ్రహ్మ సిద్ధాంతములో వరుసగ సదాశివ బ్రహ్మ(లేదా  పరబ్రహ్మ), (కామేశ్వర, కామేశ్వరి లేదా(పురుషుడు,ప్రకృతి),విష్ణువు,బ్రహ్మ,రుద్రుడు,(త్రిమూర్తులు)ఉంటారు. మనకిశివాదిషణ్మతములు ఉన్నాయి. సాంఖ్యులు ప్రకృతిపురుషుడు అన్నదానినే కైలాస, వైకుంఠ,గోలోక,మణిద్వీప వాసులలొ ఎవరినన్నా  అనుకోవచ్చు.బ్రహ్మ వైవర్త పురాణం , చైతన్య సాంప్రదాయంగోలోకములోని రాధాకృష్ణులను అత్యున్నతస్థితిగాపరిగణిస్తాయి. ఆ కృష్ణుని పూర్ణ అవతారమే   మనద్వాపర యుగ కృష్ణుడు. ఆ ప్రకృతియే,(లేదా శక్తి,లేదా యోగమాయ) రాధ.రాధ పాత్ర భాగవతంలోకనబడదు.కృష్ణుడు అంటే పురుషతత్త్వం,శ్రీకృష్ణుడు అంటే శక్తితో కూడిన కృష్ణుడు.శ్రీకృష్ణుడు అనడమే మనకు శ్రేయోదాయకం. శ్రీఅంటే మహాలక్ష్మి ఆమెయేరాధ.  బ్ర.వై. పురాణంలోబ్రహ్మ ఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం, కృష్ణఖండం అని నాలుగు భాగాలు. ఇది సృష్టి చరిత్ర(సర్గ, ప్రతి సర్గలు)

9

శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి?ముందు చిత్తమంటే ఏమిటో తెలుసుకోవాలి. పంచజ్ఞానేంద్రియాల తరువాత మనస్సు అనేఅంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే. కోతిలాగంతులు వేస్తుంది. ఆ పైన బుద్ధి. వివేకానికికేంద్రము. ఆపైనది చిత్తం. హృదయతత్త్వం.తరువాతది అహంకారం(మమకారంతోపాటుగా) .నేను,నాదీ అనుకోడం  ఇవన్నీ ఆత్మను ఆవరించే జీవ లక్షణాలు.ఇంగ్లీషులో చెబితే mind, intellect, consciousness, ego covering pure soul matter. గోకుల నివాసులందరి హృదయాలుకృష్ణునితో నిండిపోయాయి. గోపికలు మొదట్లో”మధురానగరిలో చల్ల నమ్మబోదూ”అనితిరిగేవారు. ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నామరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూగుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా,ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహవారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనేఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో”చిత్తవృత్తి నిరోధం.” గోకులంలో అందరూమానినులే. అందరి హృదయాలలోనూ  కృష్ణుడే.ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవంజరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు.తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితోమధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లోచిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటేచిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.

10

ఆదిశక్తికి పరమేశ్వరునికీ ఉన్న సంబంధం -పరమాత్మయైన శ్రీకృష్ణుని స్త్రీమూర్తిగా తలచుకోవాలంటే లలితాదేవిని  తలచుకోవాలి.భాగవతంలో ప్రారంభ పద్యాలు చూడండి – లలితస్కంధము, కృష్ణమూలము .. భాగవతాఖ్యకల్పతరువు.. భాగవతమనే   కల్పవృక్షానికి లలిత -స్కంధము (మాను), కృష్ణుడు – మూలము (వేరు). అలాగే శ్రీరాముడు స్త్రీ గా శ్యామల.—- వైదేహీసహితం సురద్రుమతలే, హైమే మహామండపే …రామం భజే శ్యామలాం.  అలాగే వేంకటేశ్వరునిపేరు బాలాజీలో బాల.

11

కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీగోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి?వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలనికాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో)స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలుఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగాకృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కనఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరువస్త్రాలు లేకుండా వ్రతభంగం చేశారు. పైకి వచ్చినమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథతెలిసినదే.  వస్త్రం ఆవరణ, ఆచ్ఛాదన. గోపికలుజీవాత్మలే. అజ్ఞానం వస్త్ర రూపంలో కప్పి ఉంచింది.అజ్ఞానపు తెరతొలగిస్తే అంతాపరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్నవస్తువు ఒకటే.వ్రతఫలం అప్పటికప్పుడుపురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనంలభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.

మిగతా భాగం రేపు చూద్దాం
ఓంనమోభగవతే వాసుదేవ కృష్ణాయనమ:
????????????

Related:   శ్రీ ధూమావతీ హృదయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *