Home Bhakti శ్రీ గరుడ పురాణం మూడవ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం మూడవ అధ్యాయము

- Advertisement -

శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి నరకం లో శిక్షలు వివరించడం….యమధర్మ రాజు ఎలా ఉంటాడు? అసలు చిత్రగుప్తుడు ఎవరు?ఆయన పనేమిటి?మరణానంతరం మనతో పాటు వచ్చేవి ఏవి? శ్రవణులు అంటే ఎవరు?

శ్రీ గరుడ పురాణం
మూడవ అధ్యాయము

శ్రీహరి! ఇలా యమమార్గం అంత గడిచాక,యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధలు అనుభవిస్తారు? అని గరుడుడు అడుగగా. శ్రీహరి నరక బాధలు వింటే నువ్వు భయపడతావు.అయిన ఆడిగావు కనుక చెప్తాను విను!!!
బహుభీతి పురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంది. అక్కడ నరక బాధలు అనుభవించే పాపుల హాహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు. యమపురంలో భటులు ఆ ఏడుపు విని,దక్షిణద్వార కావలి వాడు అయిన ధర్మధ్వజునితో పాపాత్ముడు వచ్చాడు అని చెప్తారు.

ఏది వెంట రాదు…..

ఇట్లా జీవిత కాలం పొగుచేసిన ధనాన్ని వారు స్వానుభవం లోకి తెచ్చుకోలేక ,కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళ సంబంధీకులు అనుభవిస్తారు. ధర్మ సూక్ష్మం విచారించి చూసినప్పుడు అయ్యో! అతడు ఎన్నో పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా,వాళ్లంతా దాన్ని భాగాలుగా చేసుకోవడానికి తయారుఅయ్యారే మరి అతడు చేసిన పాపాల్లో భాగం పొందడానికి సంసిద్దులు అవుతారా? కానేకారు…..అందులో వీసమెత్తు పాపం కూడా వారిని అంటదు.
పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు.యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రాగుప్తునకు పాపి వచ్చాడు అనే సమాచారం చేరగానే,అతడా విషయాన్ని యమధర్మ రాజుతో చెప్తాడు. యమధర్మ రాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో౼ ఎవరు మహాపాపాత్ములో తెలుసు! అయిన చిత్రాగుప్తుడిని అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే అయిన శ్రవణులని అడుగుతాడు.

ఈ శ్రవణులు అనే వారు బ్రహ్మ పుత్రులు. వీరు స్వర్గలోక,మనుష్య లోక,పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ ఆటంకం లేకుండా సంచరించే వాళ్ళు. దూరశ్రవణ౼దూరదర్శనాది విద్యలున్నవారు.వీరి భార్యలు అలాంటి వారే. వీరిని శ్రవణీ అంటారు.వీరు ముల్లోకాల్లో ఉన్న స్త్రీ చేష్టలను బాగా గమనించగలరు.ఈ శ్రవణీ౼శ్రవణులు ప్రత్యేకంగా౼పరోక్షంగా ఏయే పాపాలు చేశారో చిత్రాగుప్తునకు చెప్తారు

యమధర్మరాజు కు గూఢచారి వంటి వారైనా ఈ శ్రవణులుకు మనుషుల త్రికరణ శుద్ధి తో చేసిన పాపాలన్నీ ఎరుక పడగలవు. వీరు యదార్ధావాదులు౼దాన వ్రతాధి పుణ్యకర్మలు చేసినవారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే,సత్యవాదులు అయిన వీరివల్ల పాపుల చరిత్ర కూడా యమునికి తెలియును. మనుషులు చేసే సమస్త కార్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్యచంద్రులు,వాయువు,అగ్ని,అంతరిక్షము, భూమి౼నీరు,రాత్రింబగళ్లు౼రెండు సంధ్యల ధర్మము౼ మానవుని ప్రవర్తన ఎరుగుదురు. ధర్మరాజు చిత్రాగుప్తుడు శ్రవణులు,మున్నగువారు౼శరీరదారిని ౼అతడు/ఆమె చేయు పాపపుణ్యములను చూస్తుంటారు

యముడు ఇలా శ్రవణ, చిత్రాగుప్తాదుల సహాయం వల్ల మనుషుల పాపాపుణ్యములు తెలుసుకుని వారిని పిలిచి తన నిజస్వరూపం చూపిస్తాడు.
యముని శరీరం మిక్కిలి పెద్దది, భయంకరమైనది. అతని హస్తమున దండము ఉంటుంది. మహిషము(దున్నపోతు) ఎక్కి ఉంటాడు. అతని స్వరము ప్రళయకాలపు మేఘగర్జన లాగా ఉంటుంది.కాటుక కొండవలె నల్లగా వాని రూపం ఉంటుంది. అతని ఆయుధములు మెరువులు వాలే మెరుస్తూ ఉంటాయి. ఇట్టి ఆయుధములు 32 చేతులతో ధరించి భయాంకరుడై ఉండును. మూడు యోజనములు పొడుగు ఉండును. అతని కనులు దిగుడుచావులవలె ఉండును. కొరలతో ౼ ఎర్రని కన్నులతో,పెద్ద ముక్కుతో ౼ మిక్కిలి భయంకరుడు గా ఉంటాడు. అతనివద్ద మృత్యువు,జ్వరము మున్నగు పరివారం ఉండును.

అతని పరివారం కూడా అతని వలె భయంకరముగా ఉంటుంది.ఆ పరివారం కూడా యముని వాలే పాపుల్ని గద్దించును. ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు!!! పాపాత్ములు భయపడతారు. (ఇతని స్వరూప వర్ణన ముందు ఇంకా ఉంది)

చిత్రాగుప్తుడు మృత్యుజ్వరాది రోగాలతో కూడి,అతి భయంకరుడై యమునికి సమీపంలో ఉంటాడు. అతనికంటే అతని దూతలు ఇంకా భయంకరులు. పాపులు వీరి గర్జనలకే వణుకుతూ ఉంటారు. దానాగుణము లేని పాపులు మరింతగా భయపడతారు.
యముని ఆజ్ఞ మేరకు,ఏడ్చే పాపాత్ములని చూస్తూ చిత్రాగుప్తుడు “ఓరి మూఢు లారా?పాపాలు చేయనేల? ఇంతగా శోకించానేల? పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు అని తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితిమంతులు అయిన,దరిద్రులు అయిన,పండితులు అయిన,పామారులైన, బలవంతులు అయిన,బలహీనులు అయిన కానీ సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట సమానులే! అందరిని ఒక్క రీతిగానే శిక్షించడం జరుగుతుంది,పక్షపాతం ఉండదు” అని చెప్తాడు. పాపులకు నోరాడదు.

తదుపరి పోస్టులో వివిధ రకాల అయిన నరకాలు, వాటిల్లో విధించే శిక్షలు.
హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-01 23:36:04.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...
- Advertisement -

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...

Related News

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...

Ananda Marga | Ananda Marga: Meditation, Yoga and Social Service

Product Name: Ananda Marga | Ananda Marga: Meditation, Yoga and Social Service Click here to get Ananda Marga | Ananda Marga: Meditation, Yoga and Social...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here