Home Bhakti శ్రీ గరుడ పురాణం మొదటి అధ్యాయము

శ్రీ గరుడ పురాణం మొదటి అధ్యాయము

- Advertisement -

జీవుడు దేహాన్ని వదిలి….యముడి దగ్గరకు వెళ్లుట,తిరిగి భూలోకానికి రావడం,పిండ శరీరము ధరించుట.

శ్రీ గరుడ పురాణం
మొదటి అధ్యాయము (నిన్నటి పోస్టు కి సశేషం)

తప్పు చేసినవాడ్ని రాజ భటులు దండించినట్లు ఆ జీవుని యాతనా శరీరానికి మెడలో పాశాలు వేసి యమభటులు ఆ జీవిని చాలా దూరం తీసుకుపోతారు.దారిలో అతనికి చీటికీమాటికి నరక వృత్తాంతాలు చెప్తారు,భయపెడతారు.
ఓరి పాపి!! త్వరగా నడువు నువ్విప్పుడు వెళ్ళేది నరకానికి! ఆచిరకాలం నిన్ను కుంభీపకాది నరకాల్లో ఘోరాది నరకాల్లో వేస్తాము అంటూ యమకింకరులచే మాటలకు ఆ జీవుడు హాహాకారాలు చేస్తాడు. దీనికి తోడు తన భంధువులు చేసే అక్రందన ధ్వనులు కూడా ఆ జీవుని చెవులకి సోకుతూ ఉంటాయి

దారిలో ఆ జీవుడు భటులకి వణుకుతూ, తన పాపాలు తలచుకుంటూ,కుక్కలచే కరవబడుతూ ఉంటాడు. నడిచే శక్తి లేకున్నా,కొరడాలతో కొట్టడం చేత జీవుడు కాలిన ఇసుక పర్రలో నుండి ఎండ-వేడి౼ వడగాలుల చేత భాదింపబడుతూ ఆకలిదప్పుల చేత బడలిక చెందుతు ఏదోలా నడుస్తుంటాడు.

మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడ నుండి బయలుదేరిన రెండు ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరకభాదలు చూపి,యముని దర్శింప చేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుని ముహూర్తకాలం లోనే ఆకాశ గమన మార్గంలో తిరిగి భూలోకానికి తీస్కుని వస్తారు

కానీ ఏం ప్రయోజనం?….జీవుడు ఇక్కడకు తిరిగి వచ్చినా,తన దేహంలోకి తిరిగి ప్రవేశింప గోరినా యమభటులు పాశాలు గట్టిగా తగులుకుని ఉండటం వల్ల అతడి శ్రమ అంత నిష్ఫలం చెందుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోదిస్తాడు. అప్పుడు అతడికి పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము,చేయబడిన దానాలే నరకంలో ఉపశమనం. అయినప్పటికీ నాస్తిక౼పాపాత్ములకి వీటివల్ల తృప్తి కలుగదు.

అనగా….వీరికి పుత్రులు ఇచ్చే జలాంజలి,శ్రార్ధం, దానాలు చేరవు. పిండము భుజిస్తున్నా కూడా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తున్నా ప్రళయకాలం వరకు పిశాచ రూపంలో జనులు తిరగని అడవుల్లో తిరుగుతారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా!!
కనుక మరణించిన మొదలు 10 రోజుల వరకూ పుత్రుడు పిండ ప్రధానం చేస్తూండాలి. ఈ ప్రేత పిండం 4 భాగాలు గా విభజించబడగా అందులో రెండు భాగాలు యాతనా శరీరానికి, ఒక భాగం యమదూతలకు మిగిలిన భాగం మృతి చెందిన వారికి అందుతుంది అని శాస్త్రం.

మరణించిన నాటి నుండి 9 రోజుల పాటూ ఇలా ఇవ్వబడే ప్రేతపిండం వల్ల జీవునికి హస్త ప్రమాణం కలిగిన దేహం కలగడం 10వ నాస్తికి పిండం వల్ల ఆ దేహానికి బలం కలగడం సంభవం. జీవుడు ఈ పిండ దేహము తోనే పుణ్య పాపాలు అనుభవిస్తాడు. ఒక్కో రోజు ఇచ్చే పిండం ప్రకారం

మొదటినాడు- శిరస్సు

రెండోవనాడు- కంఠం, భుజాలు

మూడవనాడు-హృదయం

నాలుగువనాడు-వృష్టము

ఐదవనాడు-బొడ్డు

ఆరవనాడు-మొల,గుహ్యవయవం

ఏడవనాడు-తొడలు

ఎనిమిదవనాడు-పిక్కలు

తొమ్మిదవనాడు-పాదములు

పదవనాడు-పిండము వల్ల ఆకలి
దప్పులు కలుగుతాయి

11,12 నాటి పిండము వల్ల ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి పుత్రులు ఇచ్చే పిండములు భుజిస్తాడు.
13వ నాడు యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతిలాగా దుర్గమమైన నరక మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు…

వైతరణీ నది వైశాల్యాన్ని మినహాయించినా కూడా యమపురి 86000 ఆమడల దూరంలో ఉంటుంది.ఈ మార్గాన్ని జీవుడు ఒక రాత్రి, ఒక పగలు (ఒక్క రోజు కాలంలో ) 247 ఆమడల చొప్పున నడుస్తూ వరసగా 16 పురాలు ఆ పురాలు ఏమనగా
సౌమ్యము,
సౌరి,
నగేంద్ర భవనము,
గంధర్వ,
శైలాగను,
కౌంచ్ర,
క్రూర,
విచిత్రభవన,
భహ్వాపడ,
దుఃఖద,
నానాక్రంద,
సూతప్త,
రౌద్ర,
పయోవర్షణ,
శీతాడ్య బహుభీతి పురములు దాటి యమపురి చేరతాడు.
ఒకటవ అధ్యాయము సమాప్తము
హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-01 15:16:13.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here