శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయం

0
94

శ్రీమహావిష్ణువు మానవజన్మ విశిష్టతను గరుత్మంతునికి వివరించడం ౼జీవుడు తాను పుణ్యాలు చెయ్యలేదు అని రోధించడం౼ సౌరి పురం చేరుట.

శ్రీ గరుడ పురాణం
రెండోవ అధ్యాయం

గరుడా!!! భూత,ప్రేత,పిశాచ దేహం ఎత్తినప్పటికి జీవులు శ్రేష్ఠులే! కానీ,సర్వోత్కృష్ట దేహాలు మాత్రం మానవ జన్మ ఎత్తి ప్రేతదేహులు ఐనవారు తదుపరి పసుపక్ష్యదీ జీవులు లెక్కించదగును. కనుకనే మానుష జన్మ సర్వోత్కృష్ట మైనది అని చెప్పారు. కోటి జన్మలు ఎత్తిన లభించని మోక్షం స్వర్గం పొందడానికి కారణమైనది మనిషి జన్మ. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చెయ్యకుండా సత్కర్మలు ఆచరించి ధన్యులు అయ్యేవారి కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించే వారే లోకంలో చాలా మంది ఉన్నారు.

భార్య,పిల్లలు,ధనం…..ఈ మూడింటిని నిరంతరం చూస్కుంటూ వారిమీద మనసు నిలేపేవారు కొందరు, చేయతగని ఘోర కృత్యాలు (నరహత్య,స్త్రీ హత్య,శిశుహత్య, గురుద్రోహం) ఉదాహరణలు చేసేవాళ్ళు కొంతమంది. నోటివెంట రాకూడని మాటలతో (పరుష పదాలు) ఉచ్చరిస్తూ వ్యర్ధ ప్రసంగాలు చేసేవాళ్ళు కొందరు. వీళ్లంతా మృగలతో సామానులు.

ఆశతో కూడిన మనసుకి తృప్తి ఉంటుందా? ఆశకు తృప్తి బద్ధ వైరం కదా! అంతులేని సంపద లభించినా,ఇంకా ఏదో అందలేదు అనే తపన,మరింతగా ఆదుకోవాలి అని ఆరాటం! ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనసు మాలినం అవుతుంది. మలిన హృదయం లో పాపపుటాలోచనలు ప్రవేసిస్తాయి.దాంతో మానవత్వం కోల్పోతాడు. మానవత్వం నశించిన మనిషి జన్మ అధమాధమం. అట్టివాడు చేసే క్రూరకృత్యాలు ఊహకి కూడా అందవు.

Also READ:   మనలోని శక్తులు

కోరిక మీరి ఆశగా,ఆశ మీరి దురాశగా,దురాశ హెచ్చి పెరశగా పరిణమిస్తుంది. కన్నుమిన్నూ గానక పేరాశ అనే లోభమోహాలకు లొంగినవారికి పాపం పట్ల విచక్షణే ఉండదు. నరకం చేరడానికి ఈ పేరాశ రాజమార్గం లాంటిది. అట్టి వారికి పుణ్యం దరిదాపులకి కూడా రాదు. కనుక,దేహధారి పేరాశ కు లొంగకుండా పుణ్యసముపార్జన వైపు మళ్లించుకోగలిగితే ఇహలోకంలో మహాత్ముడి గా కీర్తింపబడటమే కాక, అంత్యమున పుణ్యలోకవాసాన్నీ పొందగలరు

Please View My Other Sites

కానీ అటువంటి పుణ్యాలు తను చెయ్యలేదు అని ఈ దుర్భరమైన వేదన కలిగింది అని జీవుడు వాపోతు ఉంటాడు.పరోపకారం కలలో అయిన తలచనందుకు చింతిస్తాడు. ఎన్నెన్నో సత్కార్యాలు చేయవలసి ఉన్న,అవేవి చేయక తను చేసిన పాపకర్మల ఫలితాన్ని తానుగాక ఎవయు అనుభవిస్తారు అని వేదన పడుతూ ఉంటాడు. మరణించిన వాడు ౼భయంకరమగు ౼ యమలోకమార్గమున౼ యమభటులచే తీసుకొనిపోబడుచు౼ తమవారిని తలుచుకుని దుఃఖించును. మిక్కిలి పుణ్యము చేసినవారికి మాత్రమే మానవ జన్మ కలుగును. అట్టి మానవ జన్మ పొందికూడా ౼ నేనెట్టి సత్కార్యాలు చెయ్యలేదు. తపము,జపము,హోమాలు చెయ్యలేదు. తీర్థ యాత్రలు చెయ్యలేదు,దేవతలను,బ్రాహ్మణులను,సజ్జనులను, గోవులను పూజించలేదు. అసలు ఎవరికి ఉపకారం చెయ్యలేదు. వేదశాస్త్ర పురాణాలను గౌరవించలేదు. పురాణము కూడా వినలేదు. భార్యను/భర్తను ౼ పెద్దలను ఆదరింపలేదు. అయ్యో ఉత్తమమైన మానవ జన్మ పొంది సద్వినియోగం చేసుకోలేదు అని విలపిస్తూ ఘోరతిఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తు ఉంటాడు.

Also READ:   ప్రతి ఒక్క హిందువు నిత్యం పాటించ వలసిన నియమాలు

ఇలా బయల్దేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి,18 రోజున సౌమ్యపురం చేరతాడు. ఈ పురంలో ప్రేత గణం నివసిస్తుంది. అక్కడ ప్రవహించే నది పెరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడో మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్య బిడ్డలను బంధువులని జ్ఞాపకం తెచ్చుకుని విచారిస్తూ ఉంటే యమభటులు ౼ మూర్ఖుడా!!! నీవి అనుకున్న భాగ్యసంపదలు, నీవారు అనుకున్న భార్యపుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ??? నీవెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు.
పరలోకపు బాటసారి!! నీవు అట్టి సంబలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్య కార్యాలే౼ పరలోక గమనంలో దారి అని పెద్దలు,పురాణాలు చేపలిన మాటలని వినలేదా?

Also READ:   శివాభిషేక ఫలములు

మూర్ఖుడా!! ఈ మార్గమున ధనసాధ్యములైన క్రయ విక్రయములు ఉండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దాన్ని నువ్వు ఎందుకు సంపాదించే ప్రయత్నం చేయలేదు? కర్మఫలితం అనుభవించాల్సిందే అని యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములు తిని,సౌరి పురానికి చేరతారు.

ఈ అధ్యాయం లో చివరి ట్విస్ట్ రేపటి పోస్టులో(దానితో రెండో అధ్యాయము సమాప్తం అవ్వబోతోంది)
హిందూ ధర్మ చక్రం