Home Bhakti శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయము (చివరి భాగము)

శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయము (చివరి భాగము)

- Advertisement -

ఏ ఏ రోజు జీవుడు ఎక్కడికి వెళ్తాడు?ఎప్పుడు పిండం భుజిస్తాడు?జీవుడు యమపురి చేరుట!!!!

శ్రీ గరుడ పురాణం
రెండోవ అధ్యాయము (చివరి భాగము)

యముని వంటి జంగముడు అనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపక్ష శ్రార్ధం వల్ల లభించే పిండాలు భుజించి జీవుడు తిరిగి బయల్దేరి నగేంద్ర భవనపురాన్ని చేరి,అక్కడే అసిపత్రవనం చూసి ఏడుస్తుంటే యమదూతలు అతనిని నిర్దయగా ఈడుస్తారు.
అక్కడ పిండములు భుజించాక మూడో మాసాన గన్ధర్వపురం చేరి జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి వాటిని భక్షించి తిరిగి బయల్దేరుతాడు.
అక్కడ నుండి రాళ్ళ వాన నిరంతరం కురిసే శైలాగమపురం చేరి,నాల్గవ మసికంలో పిండాలు అక్కడ భుజించి ఐదవ మాసంలో క్రౌంచ పురం చేరతాడు. అక్కడి జనులు అంతా క్రూరులే. ఐదవ మాసికపిండాలు తిని క్రూరపురానికి చేరతాడు. అక్కడ నుండి ఇక్కడి లరాజేసులు నిర్దయులే!! ఇక్కడ 171 రోజు (ఊన షాన్మసికం) పిండాలు భుజించి అప్పుడు తనవారు జరిపే ఉదకుంభ దానం వల్ల తృప్తి చెంది,రెండు ఘడియలు పాటు విశ్రాంతి తీసుకుంటాడు.

తదుపరి అక్కడ నుండి బయల్దేరి యముని సోదరుడు అయిన విచిత్ర రాజు పరిపాలించే విచిత్రభవనము అనే పట్టణానికి చేరతాడు. స్థూల శరీరుడు అయిన అతడ్ని చూసి జీవుడు భయపడి పారిపోతూ ఉండగా,కొందరు పల్లెవాండ్రు అతనికి ఎదురు వచ్చి “రేవున పడవ సిద్ధంగా ఉంది. మేము వైతరణీ దాటించే వాళ్ళము. గోదానం చేసి ఉన్నట్లు ఐతే నీవు పడవ ఎక్కవచ్చు” అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే,ఆ జీవికి ఆ నది యందు ఉన్న జలం సలసల కాగుతున్నట్లు కనిపిస్తుంది. చేయని వాడు అందులోకి దిగి నడుస్తుంటే, ఆ పాపాత్ముడ్ని నోట ముల్లు గుచ్చి చేపను పైకి లాగినట్లు గా యమభటులు ఆకాశ మార్గాన నడుస్తు ఆ జీవుడ్ని నది దాటిస్తారు.
ఆరవ మాసిక పిండాలు భక్షించినా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడ నుండి బయల్దేరి భహవ్డపురం చేరి ఏడో నెల పిండాలు తింటాడు. తరువాత ఎనిమిదవ మాసంలో దుఃఖద నగరం,తొమ్మిదవ నెలలో నానాక్రందపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు.

ఇట్లే పది,పదకొండవ మాసాలు సూతప్తభవన పురము, రౌద్ర పురములలో కూడా పిండాలు తిని పదిహేను రోజులకి (345 రోజులకి) కాలానికి పయోవర్షణ నగరానికి చేరతాడు. ప్రేతల్ని బాధించే వర్ష మేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ న్యూనాబ్దిక శ్రార్ధ పిండాలు భుజించి శీతాధ్య నగరానికి చేరి ఆకలికి,చలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలు భాపేవారికోసం చూస్తాడు. నీవు చేసిన పుణ్యం కానీ,నీకై నీ వారు చేసిన ఔణ్యం కానీ ఏమైనా ఉందా అని యమభటులు ఆరా తీస్తారు

యమభటులు అతన్ని అదిలించి “నీకు అంత పుణ్యం ఎక్కడ ఉంది? అనుభవించక తప్పదు!” అని కఠినంగా పలుకగా ప్రధామాబ్దికం రోజున ఇచ్చిన పిండోదాకాలు గైకొని బహుభీతి పురాన్ని చేరుకుంటాడు. అక్కడ హస్త ప్రమాణ పిండ రూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల ౼ వాయురూప యాతనా శరీరాన్ని పొంది ౼ కర్మానుభవముకై ౼ యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడ యమపురం చేరువగా ఉంటుంది.
జీవుడు ఇక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతనా శరీర ధారి అయ్యి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రార్ధ కర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలు అన్ని పితరులకు తప్పవు. యమలోకనికి గల నాలుగు ద్వారాలో ఇది దక్షిణ మార్గము.

రెండోవ అధ్యాయము సమాప్తం

హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-01 23:36:02.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...
- Advertisement -

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

Related News

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here