Home Bhakti శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయం

శ్రీ గరుడ పురాణం రెండోవ అధ్యాయం

- Advertisement -

శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి నరక మార్గం,వైతరణీ నది ఎలా ఉంటుందో వివరించడం.

శ్రీ గరుడ పురాణం
రెండోవ అధ్యాయం

నా భక్తుడు అయిన నిన్ను కూడా నరక మార్గం వణికిస్తుంది. అది బహు దుర్గమము. చెట్ల నీడ ఉండదు. ఆహారం జలం కొంచం అయిన దొరకదు. అక్కడ ఏక కాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తపింపజేస్తారు. అదీ పాపాత్ములని బాధించడానికే!!
ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంతింత అని చెప్పజాలము. ఒక్కోచోట కాళ్ళల్లో దిగే ముళ్ళు,ఒక్కో చోట విషపూరితమైన పాములు౼తేళ్లు మరికొన్ని చోట్ల కుక్కలు,పెద్ద పులులు,సింహాలు కారుస్తాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది.
అలాగే ౼ ఆ దారిలో అసిపత్రవనం అని ఒకటి ఉంటుంది దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు,కాకులు,గుడ్లగూబలు, తేనె టీగలు, దోమలు ఈ అసిపత్రవనం భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. హస్త మాత్రమైన పిండ దేహం ఈ చెట్ల ఆకుల చేత ముక్కలు, ముక్కలుగా తరిగేయబడుతుంది

ఒక్కోచోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని మార్గాయసానికి గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురద గుంటలు,ఎర్రగా రాగి రంగులోకి మారిన కాలిన ఇసుక,నిప్పులు,సలసల కాగే నీళ్లు,కత్తులు….ఇలా ఎన్నెన్నో మార్గ మధ్యం లో జీవుని యాతనలకు గురి చేస్తాయి.ఇవి గాక చీము,నెత్తురు,మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవాల్సి వస్తుంది.

అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణీ నది. యమమార్గంలో ఇది నూరు ఆమడలు ప్రవహిస్తుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు,దీని లోపల చీము నెత్తురు ప్రవాహాలు,మాంసమే బురద,వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది ఇది. క్రూరమైన జలపక్షులు౼మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి, పాపాత్ములని చూసినవెంటనే అత్యుత్సాహం తో బాధించుటకు సిద్ధం అవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు,వజ్రాసమానం అయిన ముక్కులు గల గ్రద్దలు,బొంత కాకులు,జలగలు,మాంస భక్షణ చేసే చేపలు,తాబేళ్లతో నిండి ఉంటుంది..
పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధకు తాళలేక,తమవారిని తలుచుకుని మాటిమాటికి రోదిస్తూ ఉంటారు. ఆకలి దప్పులకి ఓర్వలేక పాపులు ఆ రక్తం తాగవలసిందే!! కానీ అది ఎన్నడూ ఎండిపోని జీవనది.పాపాత్ములు పాలిట ఘోరమైనది.
తేళ్లు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడినవారిని,ఆ సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవరూ సమర్థులు కారు. కేవలం ఇది పాపులకోసమే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికంటే దారుణమైన నది ఇంకోకటి లేనే లేదు. ఇంతటి ఘోర మార్గము కేవలం పాపుల నిమిత్తమే కల్పించబడినది

ఈ మార్గం లో దుఃఖితులై వెళ్లే వారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కిట్టి,మరి కొందరి పిర్రలకు శూలాలు గుచ్చి,కొందరిని కాలపాశాలతో యమభటులు లాగుతూ వుండగా కొందరు పాపుల్ని కాకులు లాగుతూఉంటాయి.
వివిధ ఆయుధాలతో మోదుతూ, భటులు ఈ పాపుల్ని లాక్కుపోతుంటే,వారి నోటి నుండి రక్తమే నురగలు గా రాగా,మాటిమాటికీ తమవారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక చావులేక పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు వెళ్తూ ఉంటారు..

సశేషం.
తదుపరి పోస్టులో మానవజన్మ మరియు దాని గొప్పదనం,ఈ అధ్యాయము చివర్లో చిన్న ట్విస్ట్.

హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-01 19:17:26.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here