Home Bhakti శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము

- Advertisement -

గరుడ పురాణం ప్రకారం 21 ఘోర నరకాలు.

శ్రీ గరుడ పురాణం
3వ అధ్యాయము

21 అతిఘోర నరకాలు ఇవి.
1.తమిస్రము
2.అంధ తమిస్రము
3. రౌరవం
4. మహారౌరవం
5.కుంభీపాకము
6.సూచీముఖం
7.అసిపత్రవనము
8.అవీచి
9.అంధకూపము
10.వైతరణీ
11.పుయోధ
12. కృమిభోజనం
13. ప్రాణరోధ
14.కాలసూత్రము
15.సందర్శము
16. తప్తోర్మీ
17.వజ్రకంటకం
18. శాల్మలి
19. వినాశము
20. నానాభక్షణము
21.రేతః పానము
ఇవి కాకుండా మరికొన్ని (సేకరణ)

22. దండకాసుర
23. అవదనిరోధన
24.పర్యావర్తన
25.శూలాప్రోతము
26.అవీచిమీంత
27.క్షారకర్దమ

ఇప్పుడు నరకాలు ౼ పాపాలు ౼ శిక్షలు చూద్దాం

తమిస్ర నరకం ౼ పరధన, పరస్త్రీ అపహరణకు ౼ అంధకార బంధురమున పడేసి కర్రలతో బాదుదురు.

అందతామిస్ర నరకం – మోసం చేసి స్త్రీ ధనమును పుచ్చుకునువారు ౼ కళ్ళు కనిపించని నరకము నరికిన చెట్ల యందు పడిపోవుదురు.

రౌరవము ౼ ఇతర ప్రాణులని చంపి తన కుటుంబాన్ని పోషించుకున్న వారికి ౼ రురువులు అన్న పాములకన్న ఘోరంగా జంతువులు హింసించును

మహారౌరవము ౼ సంపాదించిన అచ్చము తనకోరకె వెచ్చించుకున్న వాడ్ని ౼ పచ్చి మాంసం తినేవారు హింసించెదరు

కుంభీపాకం ౼ పశు,పక్ష్యాదులని చంపి పొట్ట నింపుకున్న వాడ్ని ౼ సలసల కాగు నూనెలో పడవేయుదురు.

సూచీముఖి ౼ ధన అహంకారం తో అందరిని చిన్న చూపు చేసినవాడ్ని ౼ శరీరమును సూదులతో బొంత వాలె కుట్టుదురు

అసిపత్ర వనము ౼ ఆపద సమయముల యందు కాక ఇతర సమయముల యందు వేదాలని ధిక్కరించినవారు ౼ కొరడాలతో గొడ్డుని బాధినట్లు బాదుట. సర్వాంగాన్ని కత్తులతో కోయుట

అవీచి ౼ దండించడగని వారిని దండించిన రాజుని ౼ చెరుకుగడల వాలే గానుగాల్లో పెట్టి త్రిప్పుదురు

అంధకూపము ౼ నల్లులు మున్నగువానిని చంపినవారిని ౼ పాములు,నల్లులు,దోమలు,చీమలు హింసించును

వైతరణీ ౼ కులమర్యాద పాటించని రాజు లేదా రాజోద్యోగి ౼ చీము,నెత్తురు,తలవెంట్రుకలు,గోళ్ల చే నిండిన నదిలో త్రోయబడును

పుయోధ ౼ శౌచము,ఆచారము పాటించని వారిని ౼ మలమూత్రాదులు నిండిన సముద్రమును పడత్రోతురు

కృమి భోజనం ౼ అతిధులకు, అభ్యాగతులకు అన్నము పెట్టకు తన పొట్ట నింపుకుటున్న వాడు ౼ క్రిములతో నిండిన లక్ష యోజనములు కుండములో పడవేయుదురు

ప్రాణరోధ ౼ కుక్కలు,గాడిదలు పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులు ౼ అంపకోలలచే వేటాడుదురు.

కాలసూత్ర నరకము ౼ తల్లిదండ్రులు, వేదములు,బ్రహ్మణులని ధిక్కరించిన వారిని ౼ రాగినేల కలిగి,నెత్తిన నిప్పులు చేరుగు సూర్యుడు ఉంది మాడ్చివేయును

సందర్శ ౼ ఆపద లేకనే బ్రాహ్మణుల ధనము,ఇతరుల బంగారము,రత్నములు దోచుకున్న వారు ౼ మండుచున్న కడ్డీలతో పొడుచుట,పాటకారులతో చర్మము పీకుట వంటి శిక్షలు అనుభవిస్తారు

తప్తోర్మీ ౼ సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీ ౼ మండుచున్న ఇనుప పురుష మూర్తిని స్త్రీ చే,స్త్రీ మూర్తిని పురుషులచే కౌగలింపచేయుదురు.

వజ్రకంటక ౼ పశువులతో సంభోగం చేసినవాడు ౼ ముళ్లున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి క్రిందకి లాగబడును

శాల్మలి ౼ కులాభార్యలచే వీర్యాపానము చేయించువాడు ౼ వీర్య పానం చేయిస్తారు

నానాభోజన ౼ మాంసము తిను స్త్రీలను ౼ వాడిగల ఆయుధముల చే ముక్కలు ముక్కలు గా కోసి కేరింతలు పెట్టుదురు.

రేతః పానము ౼ వ్రత నిష్ఠ లో ఉండి మద్యపానం చేసిన బ్రాహ్మణులు, సోమపానము చేసిన క్షత్రియులు, వైశ్యులకు ౼ కరిగిన ఇనుము త్రాగింతురు.

సారమేయోదనము ౼ ఇల్లు తగలబెట్టడం,విషము పెట్టడం,దొంగతనం చేయడం,గ్రామాలకు కీడు చేయువారిని ౼ వజ్రము వలే కరకుగా ఉన్న కోరలు గల 700 జాగిలములు పీక్కుని తినను

దండకాసుర ౼ ప్రాణకోటికి భయము కలిగించు ఉగ్రస్వభావులని ౼ 5,7 తల పాములు ఎలుకని హింసించినట్లు హింసించెదరు.

అవధనిరోధన ౼ గదులలో,నూతులలో ఇతరులని బంధించిన వారిని ౼ విషాజ్ఞులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేయుదురు.

పర్యావర్తన ౼ అతిధులు,అభ్యాగతులను గద్దించిన వారిని ౼ కనుగుడ్లను కాకులచే పొడిపింతురు

శూలాప్రోతము ౼ నిరపరాధులు అడివి జంతువుల ని,ఊర పశువుల్ని నమ్మించి పొడిచి చంపిన వారు ౼ శూలములచే పొడవబడి కంభములు ఎక్కింపబడుదురు.

అవీచిమీంత ౼ అబద్ధపు సాక్ష్యములు చెప్పిన వారు, లావాదేవీల్లో బొంకిన వారు ౼ వంద యోజనములు ఎత్తైన పర్వత శిఖరం నుండి పడద్రోసి పచ్చడి చేయబడుదురు.

క్షారకర్ధమ ౼ తనకన్నా అధికుని తిరస్కరించిన వాడు ౼ తలక్రిందులు గా పడేసి బాధలు పెట్టుదురు
మరింత వివరణ తదుపరి పోస్టులో

సశేషం
హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-02 07:40:42.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here