Home Bhakti శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము చివరి భాగము

శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము చివరి భాగము

- Advertisement -

గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలు…శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి ఉపదేశించిన అత్యంత రహస్యమైన విషయం ఏమిటి??… దానానికి ఎటువంటి ధనం పనికొస్తుంది??? పరమపథం పొందడం ఎలా?? మరణాంతరం జీవుడు తో పాటు వెంట వచ్చేవి ఏవి??? మరణించిన జీవుడు నరకం లో ఏమని అక్రందనలు చేస్తాడు??

శ్రీ గరుడ పురాణం
5వ అధ్యాయము చివరి భాగము

ఏ ఏ పాపాలు చేసి ఆర్జించినా,వాటి ఫలితంగా వచ్చే నరకం నుండి ఆ సంపాద పరుడ్ని ఎవరు తప్పించలేరు. వాటి అన్నిటికి అతడు ఒక్కడే బాధ్యుడు. సరే!!! ఇంత మోహం౼మొసంతో సంపాదించిన ధనం ఏమైనా వెంట వస్తుందా?? అది రాదు. బంధువులు మొదలైన వారు,శవం తో శ్మశాననికి పోయి,మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు. దీని బట్టి ఏమి తేటతెల్లం అవుతోంది??? కేవలం ఆ జీవి చేసిన పాప కర్మలు మాత్రమే అతని వెంట రాగలవు. దానం ఇచ్చిన సొమ్ము అనుభవించడానికి అతను అధికారి కాబోడు.

పూర్వ జన్మలో చేసిన దానధర్మాలు చేసినప్పుడే, ఇప్పటి భాగ్యం సిద్దిస్తోంది అని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని భాగ్యశాలి గా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో, వారే ధర్మార్ధ కామ మోక్షలకు అర్హులు. ఇచ్చే దానం అయిన భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి. దాన ధర్మాలు చెయ్యడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపచేసుకోవచ్చు… భక్తితో చేసిన ధర్మం అణువుమాత్రమైనా మేరువుతో సమానం

ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దానాధర్మలకి వెచ్చించే ద్రవ్యం న్యాయ్యంగా ఆర్జించినదై ఉండాలి. అన్యాయం గా ఆర్జించిన ధనం దాన ధర్మలకు ఉపయోగపడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫల రహితము అవుతుంది. ఆశించిన ఫలితం ఇవ్వదు. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన ధనం, దానం చేస్తే లేదా భాగవాదర్పణ చేస్తే పుణ్యం లభించదు సరికదా….. మరింత పాప హేతువు కాగలదు.
నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారములు/కార్య కాలాపములు వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడటం అవివేకం అనిపిస్తుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవుల్ని హింసించక పోవడం – వారిని పీడించి ధనం ఆర్జించకపోవడం విశేష పుణ్యదాయకం….

నా పరమపథం పొందడానికి బ్రహ్మ,దేవేంద్రులాదులకే దుర్లభం. అటువంటిది కేవలం మనః శుద్ధి – విత్త శుద్దితో చిన్న దానం చేసినా ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను. గరుడా!!! అందుకే ఇది అతి రహస్యమైనది – పాపాత్ములకి అర్ధం కానిది అని నీకు మొదటే చెప్పి ఉన్నాను..

కనుక భక్తి శ్రద్ధలతో దానధర్మాలు చేసే వారంతా మొట్ట మొదట తాము ఆర్జించిన ధనము సమ్మతమైన ద్రవ్యమా??? పరపీడన ద్వారా పోగు చేసినట్టి ద్రవ్యమా??? అని ఎవరికి వారే జాగరూకులై గమనించుకోవాలి. స్వార్జితం ధర్మ సమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చెయ్యాలి అని వక్కాణించాడు శ్రీహరి

పదవ రోజున ఏర్పడిన పిండ దేహాన్ని పదమూడో రోజున కింకారులు లాక్కుని పోయే తీరు ఎలా ఉంటుంది అంటే….రాను రాను అంటూ మొరాయించే కోతిని తాడుకి కట్టి ఈడ్చుకుని వెళ్తున్నట్లు ఉంటుంది.
అయ్యయ్యో!!! నాకేది దారి??? నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే!!! ఎం చెయ్యను??? ఈ నరకం బాధ తప్పించుకునేది ఎట్లు?? బ్రతికి ఉన్నప్పుడు మేలుకోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేసానే…. సర్వేశ్వరుడు ఉన్నాడు అని, సత్కర్మలుకి స్వర్గఫలం / దుష్కర్మలకు నరక ఫలం తప్పదని….. దుర్మార్గం వదిలి సన్మార్గం లో నడవాల్సింది అని వాళ్ళు చెప్పే హితోక్తులు పెడచెవిన పెట్టానే….

ఇప్పుడు ఇక్కడ యమకింకరులు పార్వతాలంతేసి సమ్మెటలతో ఇనుప గదలతో బాదుతున్నారే!!!అబ్బాబ్బా!!! ఈ బాధ భరింపశక్యం గా ఉంది…. అయ్యాయో!!!! పెద్దలకు ఏ ఉపకారాన్ని చెయ్యలేదు. కనీసం చేసేవాడికి అయిన తోడ్పడలేదు. తీర్థయాత్రలు చెయ్యలేకపోయాను. చేసేవారిని ప్రశంసించలేక పోయాను. మేలైన పూజలు,అర్చనలు నిర్వహించలేక పోయాను సరి కదా…..
కనీసం చేసేవారికి పరిచర్యలు అయిన చెయ్యలేదు… నీళ్లు లేని చోట్ల చాలివేంద్రాలు ఏర్పరిచి ఉన్న బాగుండేది. ఒక చెరువునో – నూతినో ప్రోజపయోగం కోసం త్రవ్వించగలిగానా???? మొత్తం నా భూమి అంతటితో పైరు వేసుకుని అంతా నా స్వార్ధానికి వాడుకున్నాను….. అందులో కాస్త అయిన పచ్చిక కోసం పశువుల నిమిత్తం వదలక పోతిని. సాధమైనంతలో నిత్యం చిన్న దానం అయిన చేయాకపోతిని

వేద శాస్త్రాలు అభ్యసించగల నేర్పు – ఓపిక లేకున్నా కనీసం శ్రీమద్రామాయణ భారత భాగవతాలను స్వహస్తం తో రాయడమో – ఆ గాధలు వినడమో చేయలేకపోయాను. వ్రాయించడమో – కనీసం అమ్మకానికి చదవగల ఆశ గలవారికి ఇప్పించలేక పోయాను. చదవడమో – చదివించడమో చేసి ఉంటే బాగుండేది

ఆహా ఏమి నా దౌర్భాగ్యం!!! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను. కనీసం కలలో కూడా ఒక్కటంటే ఒక్కటి సత్కార్యం ఆచరించలేకపోయాను….. పైగా చెడు పనులలో ఏ.ఒక్కటి విడిచిపెట్టలేదు…..మహా పాపి అయిన నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంటే ఎంత విచారించి ఎం.ప్రయోజనం???? అని పరిపరి విధాలుగా ఏడుస్తూ – కింకరుల ఆదలింపులకి భీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తూ ఉంటాడు అని శ్రీమన్నారాయణుడు తన భక్తుడు ఖగపతికి యమమార్గం ఎంత కఠినమో వివరించాడు
5వ అధ్యాయము సమాప్తం
సుదర్శన చక్రం

Originally posted 2019-05-03 03:51:48.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here