సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. కన్ఫార్మ్ చేసి ఉత్కంఠకు తెర దించిన అక్కినేని కోడలు.!

0
33


సూపర్ ఫామ్‌లో సమంత.. ఇక్కడా అక్కడా హవా

సూపర్ ఫామ్‌లో సమంత.. ఇక్కడా అక్కడా హవా

కొన్నేళ్లుగా సమంత చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ’తో మెదలు పెడితే.. ఆమె వరుసగా ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అలాగే, తమిళంలోనూ ‘మెర్సల్’, ‘ఇరుంబుతిరై’, ‘సూపర్ డీలక్స్’లతో సత్తా చాటింది.

సినిమా ఫలితం మారింది.. సమంత మాత్రం మారలేదు

సినిమా ఫలితం మారింది.. సమంత మాత్రం మారలేదు

సమంత తాజాగా ‘జాను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఇందులో సమంత చేసిన అభినయానికి మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Also READ:   బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న బిగిల్.. రికార్డు కలెక్షన్లతో దుమారం
-->

అదొక్కటి పూర్తి చేయడంపైనే సమంత ఫోకస్

అదొక్కటి పూర్తి చేయడంపైనే సమంత ఫోకస్

చేతిలో ఉన్న ‘జాను’ కూడా విడుదల అవడంతో సమంత చేయాల్సిన సినిమాలేవీ లేవు. అదే సమయంలో ఆమె ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న దాంట్లో మాత్రం ఆమె నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో సామ్ నెగెటివ్ రోల్ చేస్తోంది.

Also READ:   28 days box office collections: తగ్గుముఖం పట్టిన సరిలేరు కలెక్షన్లు.. 28వ రోజు గ్రాఫ్ ఎలా ఉందంటే..
-->

ఫ్యాన్స్‌లో కలవరం కలిగించిన సమంత స్టేట్‌మెంట్

ఫ్యాన్స్‌లో కలవరం కలిగించిన సమంత స్టేట్‌మెంట్

ఇటీవల జరిగిన ‘జాను’ ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత చేసిన ఓ స్టేట్‌మెంట్ ఆమె ఫ్యాన్స్‌లో కలవరాన్ని రేపింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇంకో రెండు మూడేళ్లు మాత్రమే నటిస్తాను. నాకు చాలా ముఖ్యమైన కుటుంబానికి సమయం కేటాయించాలి’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ ప్రచారం మొదలైంది.

ఉత్కంఠకు తెర దించిన అక్కినేని కోడలు.!

‘జాను’ విడుదలైన తర్వాత జరిగిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో తన రిటైర్మెంట్ గురించి సమంత క్లారిటీ ఇచ్చింది. ‘నేను రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. పోయిన ఇంటర్వ్యూలో నేను సినిమాల నుంచి తప్పుకుంటా అనలేదు. నా క్రేజ్ తగ్గిపోతుందేమో అన్నాను. ఒకవేళ హీరోయిన్‌గా నటించకున్నా.. ఏదోలా ఇండస్ట్రీలోనే ఉంటాను’ అని సామ్ చెప్పింది.