సమకాలీన రుగ్మతల నివారణకు దివ్య ఔషదమే ” గ్రీన్‌ టీ ”

* సమకాలీన రుగ్మతల నివారణకు దివ్య ఔషదమే ” గ్రీన్‌ టీ ”
* ‘గ్రీన్ టీ’ తో స్థూలకాయం మటుమాయం..
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. గ్రీన్ టీ అంటే …. ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్‌ టీ (తేయాకు).

రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీటన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొటం వల్ల మార్కెట్లో గ్రీన్ టీతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు, డియోడరెంట్స్, క్రీములు కూడా లభ్యమౌతున్నాయి.

READ:   13 Major Side Effects Of Eating Too Many Pistachios (Pista)

కావలసిన పదార్ధాలు:
పుదినా ఆకులు: అర కప్పు
నీళ్ళు: కప్పు
గ్రీన్ టీ బ్యాగులు: మూడు
తేనే: రెండు టేబుల్ స్పూన్లు

గ్రీన్ టీ తయారు చేయు విధానము:
1. ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
2. తర్వాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
3. ప్లేవర్ కోసం ఆకులతో బాటు 1/2టీ స్పూన్ నిమ్మరసం, పంచదార తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
4. రెండు నిమిషాల తర్వాత వడబోసుకుని త్రాగేయటమే.

READ:   Auto Affiliate Program - Affiliate Marketing Made Easy!

ప్లేవర్స్:
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.

Originally posted 2018-02-17 22:25:22.