సహాని కి తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయా…? – Pakka Filmy – Telugu

0
43


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పాత్ర అసలు ప్రభుత్వంలో ఏంటీ…? ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న జగన్ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. తానే ముఖ్యమంత్రి కాబట్టి తనకే సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి తాను ఎం చేసినా సరే ఇబ్బంది ఉండదు, తాను చేయమని చెప్పిందే అధికారులు చెయ్యాలి అంటూ వ్యవహరిస్తారని ఆరోపణలు వస్తూ ఉంటాయి.

Also READ:   కరెక్షన్.. కియా: ట్వీట్ డిలేట్ చేసిన రాయిటర్స్..!

Please View My Other Sites

ఎంతటి సీనియర్ అధికారికి అయినా సరే ప్రభుత్వంలో స్వేచ్చ అనేది ఉండదని, ఉండే అవకాశమే లేదని విమర్శలు కూడా వచ్చాయి. నవంబర్ నెలలో సియేస్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సహాని ఇప్పుడు ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు అనే వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. నీలం సహానికి తెలియకుండానే రాజధాని తరలి౦పు ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు. ఇటీవల విజేలేన్స్ కార్యాలయాలను విశాఖ తరలించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల అయ్యాయి.

Also READ:   సోలేమని హత్యకాండపై ట్రంప్ కీలక ప్రకటన: ఈ పాటికి అమెరికా చాలా నష్టపోయి ఉండేదంటూ..!

కనీసం దానికి సంబంధించిన సమాచారం కూడా ఆమె వద్ద లేదని అంటున్నారు. అసలు ఆమెకు తెలియకుండానే దానికి సంబంధించిన ఫైల్ ముందుకి వెళ్లినట్టు చెప్తున్నారు. ఆమెను ఒక్క మాట కూడా సంప్రదించకుండా కొన్ని జీవోలు పాస్ అవుతున్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ఆమె ప్రభుత్వంలో ఎం జరిగిందో తెలుసుకునే పరిస్థితి ఉంది గాని, ప్రభుత్వానికి మెదడు లాంటి ఆమె, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఆమెకు తెలియకుండానే కొన్ని జీవోలు ఆమె పేరుతో విడుదల అయ్యాయి అని సమాచారం.

Also READ:   జగన్ పై రూట్ మార్చిన తెలంగాణ అనుకూల మీడియా…!! - Pakka Filmy - Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here