Home Bhakti సింహాచలం లోని సింహాద్రి అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి?

సింహాచలం లోని సింహాద్రి అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి?

- Advertisement -

సింహాచలం లోని సింహాద్రి అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి???

భక్తుని మాటను నిజం చేసిన భగవంతుడు

సింహచలేశుని ఆలయంలో జరిగిన వాస్తవ సంఘటన పూర్తి వివరాలు

అప్పన్న కు శాపమిచ్చినది ఆయన భక్తుడు “కృష్ణామాచార్యుడే”.
తన గానంతో స్వామి ని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి నాట్యమడించిన ప్రియ భక్తుడు కృష్ణామాచార్యులు.
తెలుగు పద కవితా పితామహుడు ఈ కృష్ణమయ్య.
అన్నమయ్యకు నన్నయ్య తిక్కనాదులకు అసలామాటకొస్తే తెలుగు లో అక్షరాన్ని లిఖితం చేయడానికీ స్పూర్తి ఈ కాంత కృష్ణమాచార్యులు.
దేవా అని సంభోధనతో తన సంకీర్తనను ప్రారంభించి “సింహగిరి నరహారి నమో నమో ధయానిధి” మకుటంతో పూర్తి అయ్యే 4లక్షల 32వేల సంకీర్తనలు రచించి స్వామి కి అంకితమిచ్చిన అపర భాగవోత్తముడు “కాంత కృష్ణమాచార్యులు”
పుట్టు గుడ్డిగా సింహాచల గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న సంతూరు గ్రామంలో పుట్టిన కృష్ణమయ్యను చిన్నప్పుడే భావిలో వదిలేశారు కన్నవారు.
కృష్ణకవ్వారు స్వామిజీ ఆ బాలుడును చూసి తీసుకొచ్చి సింహచల గ్రామన వదిలి అప్పన్న దర్శనానికీ రావడం జరిగింది.
ఆకలి తో ఏడ్వడం చూసిన కృష్ణమయ్య వద్దకు సింహాధ్రి అప్పడే స్వయంగా పాలు తీసుకొని వెళ్ళి త్రాగించడంతో ఆ బిడ్డకు తిరిగి కళ్ళు వచ్చాయి.
కృష్ణకవ్వారు స్వామిజీ రక్షించిన బిడ్డను తల్లితండ్రులు తిరిగి తీసుకొని కృష్ణమాచార్యునిగా నామకరణం చేశారు.
స్వామి దయతో తన కు అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామి కే అంకితమిచ్చారు కృష్ణమయ్య.
11వ శతాబ్దం లో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింప జేశాడు అప్పన్న స్వామి.
తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణమయ్య సంకీర్తన వింటూ ఆయన తొడ మీద కూర్చొనీ రాగి రేకు మీద లిఖించింది సింహాచల వరాహానరసింహుడే.
ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణమయ్య ఆనాటి నుండే 432000 సంకీర్తనలు రాగి రేకుల పై లిఖించి స్వామికి అంకితమిచ్చారు.
ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనంగా తొలి సారి లిఖించింది “సింహాధ్రి అప్పన్న స్వామి”.
ఆయన స్పూర్తితో నేటి తెలుగు భాష కి ప్రాణం పోసి ఆకారమిచ్చిన బ్రహ్మ “శ్రీ కాంత కృష్ణమాచార్యులు”
.కృష్ణమయ్య సంకీర్తన యఙ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం భగవద్రామానుజులు వారు విచ్చేశారు.
శ్రీ వైష్ణవ మాత ప్రచారకులుగా హరి భక్తునిగా జనుల మన్నలందుకుంటూ వైకుంఠ నారాయణుని సేవలో జీవితం గడుపుతూ శ్రీ వైష్ణవ క్షేత్రాలను పునర్దరింపజేస్తూ అష్టక్షరీ మంత్రాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ సింహగిరి శిఖరానికి చేరారు రామానుజుల వారు.
ఆలయంలో వైష్ణవ సాంప్రాదాయన్ని ప్రవేశ పెట్టి పాంచరాత్ర ఆగమ ప్రకారం ధూపధీపనైవేద్యాలు నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు ఒక తీరు గా తీసుకొచ్చి గాంగ వంశ రాజులతో శాశనం చేయించారు రామానుజుల వారు.
నేటికీ సింహచలంలో అదే సాంప్రాదాయం ప్రకారం సేవలు జరుగుతున్నాయి.
రామానుజుల ప్రవచనాలు వినడాని స్వామి హంస రూపంలో ప్రతిరోజు వస్తుండేవారు.
నేటీ ఆలయ బేడా మండపంలో ఈశాన్య మూల రామానుజాచార్యుల ప్రవచనాలు జరుగుతుండేవి.
మానససరోవరం లో మాత్రమే బ్రతికే హంస ఇటు దక్షిణ భారతదేశంలో అది సింహగిరి క్షేత్రానికీ ప్రతిరోజు వస్తూ ఈశాన్య మూల కూర్చోని రామానుజులవారీ వచనాలు వినడంతో ఆ స్థలం “హంసమూల” గా ప్రసిద్ది చెందింది .
ఇప్పటికీ సింహచల క్షేత్రంలో ఈ హంసమూల ను దర్శించవచ్చు.
ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక వైపు ఈ హంసమూల అచట శ్వేత వర్ణంలో భగవద్రామానుజుల వారిని వారితో పాటు శ్రీ సింహాచల దేవస్థానం ఏర్పాటు చేసిన రాతిశాశనాన్ని దర్శించవచ్చు.
ఇటు రామానుజుల వారికి అటు కృష్ణమయ్యకు ఇద్దరకీ ఒక్కో రూపంలో కనిపించి కటాక్షించాడు సింహాధ్రినాథుడు.
కానీ తన సంగీతానికి తన సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది.
ఆ గర్వంతో భగవద్రమానుజుల వారి పట్ల నిర్లక్ష్యం ప్రకటీంచి కనీస వందనం కూడ సమర్పించలేదు కృష్ణమయ్య.
తన కు నిర్లక్ష్యం జరిగిన సహిస్తాడు కానీ తన భక్తులకు నిర్లక్ష్యం జరిగితే సహించలేడు సింహాధ్రి అప్పడు.
కనుకనే స్వామి ని దాసానుదాసుడని పిలుస్తారు.
గర్వ భంగం కోసం రామానుజుల నోట నుండి కృష్ణమయ్యకు ఒక ప్రశ్న సంధింపబడింది.
అదే మోక్షం…
కృష్ణమయ్యతో రామానుజుల వారు నీవు పిలిస్తే అప్పన్న ఆడిపాడుతాడంటావుగా అలా నీ కడకు స్వామి వచ్చిన రోజు నాకు మోక్షం ఉందో లేదో కనుక్కోమని చెపుతారు రామానుజులవారు.
అలా ఆ సందేహన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళ్తుండగా అడుగుతాడు కృష్ణమయ్య….
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు.
ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య మరి నా మోక్షం సంగతేంటనీ అడుగగా……
నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు… ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఇది గర్వభంగమే కావడంతో తొందర పాటు లో నోరు జారి నీ “ఆలయం అగ్ని కి ఆహుతి అవు గాక” అని శపిస్తారు…
తనకే శాపమిచ్చిన కృష్ణమయ్య కు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపోవును అని ప్రతిశాపమిచ్చి అంతర్థానమవుతారు….
4లక్షల 32 వేల సంకీర్తనలు తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది…
మనో నేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు.
భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని (ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం) అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రదేయ పడి అంతరాలయన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తాయని అభమిచ్చారు అప్పన్న స్వామి..
కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి…
తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు.
వందల సంవత్సరాలు గడిచాయి. అప్పన్న ఆలయం ఒక వెలుగు వెలిగింది. కృష్ణమయ్య సంకీర్తనలు నిత్యము ఆలయంలో గానం చేసేందుకు నర్తించేందుకు గాంగనరసింహ చక్రవర్తి 108మంది నర్తకీమణులను దేవస్థానంకి అందించారు.
ఆంధ్రబోజుడు శ్రీ కృష్ణదేవరాయల వారు ఆలయాన్ని సందర్శించి తన సామ్రాజ్య చిహ్నం గా విజయ స్థూపాన్ని సింహగిరి పై ప్రతిష్టించి స్వామి కి ఆభరణాలు సమర్పించి సతీ సమేతంగా స్వామిని దర్శించుకొని తరించారు
గోగులపాటి కూర్మనాథ కవి
బహుశ తెలుగునాట ఈ కవి కోసం చాలా కొద్ది మందికే తెలుసు.
వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! అనే మకుటంతో “సింహధ్రి నారసింహా శతకం” అని 101 పద్యాలు రచించిన పరమ భక్తుడు.
కలి యుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన మహాకవి ఈ విజయనగర రామతీర్థ గ్రామంలో పుట్టారు.
18వ శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలో ఉన్నారు కూర్మనాథ కవివర్యులు.
తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తారు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది .
తన భక్తుడు కృష్ణమయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన శక్తిని తన భక్తుని వాక్కు మహత్తును రెండిటిని నిజం చేశాడు వరాహానరసింహుడు.
తనకే కాదు తన భక్తుల మాట కు శక్తి ఉందని నిరూపించి తన మహత్తు చాటిన అరుదైన దైవం సింహాధ్రి అప్పన్న.
వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.
ఆలయాన్ని నేల మట్టం చేసి నిధులు దోచుకు పోడానికి మహత్తర పన్నాగం పన్నారు.
కళ్యాణమండం పై విరుచుకుపడ్డారు ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటి ఆలయంలో అక్కడక్కడ శిధిలమై కనిపిస్తున్న విగ్రహాలు వీటిలో కొన్నిటిని నేడు పునర్నిర్మించారు.
ఆ సమయాన వైరి సంహార అని వెలుగెత్తి పిలిచాడు గోగులపాటి కూర్మనాథ కవి.
నేనైతే ఒక్కడినే ఏలాగోలా తప్పించుకు పోతా 16000గోపికలున్న నువ్వు ఏలా పారిపోతావు రావయ్య రా అని ఆర్తితో పిలిచాడు అప్పన్న స్వామిని.

పిలిచిన పలికే దైవం టక్కున తరలివచ్చాడు.
నిండు చందన విగ్రహం నుండి తుమ్మదెల గుంపై వచ్చాడు.తురష్కరులపై ఒక్కసారిగా దండెత్తాడు.
గుమ్మడికాయంత ఆకారన భయపెట్టిన తుమ్మెదల దండయాత్రలో అనుకున్నది పూర్తి గా సాధించకుండానే పలయన మార్గాన్ని ఎంచుకున్నారు తురష్కరులు.
తురష్కరలను తరిమికొట్టడానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంత భయంకరంగా కనిపించాయని అవి అలా అవె తురష్కరులను “తుమ్మెదల మెట్ట” వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతుంది.
ఆ తుమ్మెదల మెట్టే నేటి విశాఖ చావులమదుం అనే గ్రామం.
బహుశా చావులమదుం గ్రామం వినని విశాఖవాసులు లేరు అనేది అతిశయోక్తి కాదు.
అలా తన భక్తుని శాపంలో భక్తుని మాటను ఇటు తన మహత్తుని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు.
ఇప్పటికే ఆలయంలో కృష్ణమాచార్యులు సంకీర్తనలు వివిధ ప్రత్యేఖ ఉత్సవాలలో ఆలపాన చేసి స్వామి కి నివేధిస్తున్నారు.
ఇక స్వామి శాపం పూర్తి అయి చాతుర్లక్ష్య (432000) సంకీర్తనలు బయట పడితే తిరిగి సింహచల ఖ్యాతి వెలుగుతుంది.
ఆ కీర్తనలు శ్రీ కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొరంగం లో ఉన్నాయనీ.. కాదు చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారలు ఉన్నాయి.
చూద్దాం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో…
తంజావూరు దగ్గర గల ఒక గ్రంథాలయంలో సుమారు 12కు పైగా సంకీర్తనలు ఉన్నాయి.
అలానే బ్రిటీషర్లు తరలించుకుపోయిన మన సంపదలో120 రాగిరేఖుల సంకీర్తనలు కూడా ఇంగ్లాండు మ్యూజియంలో ఉన్నాయి.
మన ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తే కనీసం తంజావూరు సంకీర్తనలు బయట పడిన తొలి తెలుగు పదాలకు గౌరవం లభిస్తుంది.
ఏది ఏమైన తోలి తెలుగు అక్షరం లిఖించినది మాత్రం సింహచల కాంత కృష్ణమాచార్యులే అన్నది నిర్వివిదాంశం.

Originally posted 2019-03-16 12:44:31.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Revealed: Potential main event match of WWE Summerslam 2020

Some reports stated that Drew McIntyre vs. Randy Orton for the WWE Championship will be this year’s SummerSlam main event. The...
- Advertisement -

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం ?????????? దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ | నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ || భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ || శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే...

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు *************************** 1) వాము: వాతశ్లేష్మములనణచును. కడుపు నొప్పిని తగ్గించును. నులి పురుగులను, ఏలిక పాములను రానివ్వకుండును. వాంతులు, విరేచనాలను అరికట్టును. జీర్ణ వ్యవస్ధను బాగుచేయును. 2) కురాసాని వాము:...

Related News

Revealed: Potential main event match of WWE Summerslam 2020

Some reports stated that Drew McIntyre vs. Randy Orton for the WWE Championship will be this year’s SummerSlam main event. The...

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం ?????????? దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ | నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ || భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ || శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే...

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు *************************** 1) వాము: వాతశ్లేష్మములనణచును. కడుపు నొప్పిని తగ్గించును. నులి పురుగులను, ఏలిక పాములను రానివ్వకుండును. వాంతులు, విరేచనాలను అరికట్టును. జీర్ణ వ్యవస్ధను బాగుచేయును. 2) కురాసాని వాము:...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here