సొజ్జప్పాలు

0
86

సొజ్జప్పాలు

కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ- రెండు కప్పులు, పచ్చికొబ్బరి తురుము- రెండు కప్పులు, చక్కెర- రెండు కప్పులు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, మైదా- నాలుగు కప్పులు, ఉప్పు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను,పాలు- రెండు కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా, నీళ్లు- తగినన్ని.

తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేసి వేడెక్కాక గోధుమ రవ్వ, పచ్చికొబ్బరి తురుము వేసి వేగించాలి. ఈ మిశ్రమంలో పాలు పోసి ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, చక్కెర వేసి మరో పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఆ తర్వాత మైదా పిండిని కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీల మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి బొబ్బట్లలా చుట్టుకొని పెనం మీద నూనె వేస్తూ కాల్చుకోవాలి.

Also READ:   దొండకాయ రోటి పచ్చడి . ( పచ్చి దొండకాయలు )