స్త్రీలకు రుతు కాలంలో వచ్చే కడుపు నొప్పి

స్త్రీలకు రుతు కాలంలో వచ్చే కడుపు నొప్పి….
శాశ్వతంగా నివారించడం సాధ్యమే.

స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని వైద్యపరిభాషలో డిస్మనోరియా లేక పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌ అంటారు. ఆయుర్వేద పరి భాషలో దీనిని “రుతు శూల” అంటారు.

సుమారు 50 శాతం మంది స్త్రీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది.

రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. 3 రోజుల నుంచి 7 రోజుల పాటు కనిపిస్తుంది. రుతుక్రమాన్ని, రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీగ్రంథి, ఆండాశయంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ అన్నీ కలిపి ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతుంది. రుతుక్రమం సమయంలో నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ప్రొస్టాగ్లాండిన్స్‌ అనే ఒక రసాయనం. ఈ రసాయనం గర్భకోశం లోపలి పొరల్లో ఉత్పత్తి అవుతుంది.

Related:   Flat Belly Detox - High Converting Weight Loss Offer For 2018!

రుతు శూలను రెండు రకాలుగా చెప్పవచ్చు.

1. ప్రైమరీ డిస్మనోరియా : యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. దీనికి హార్మోన్‌ అసమతుల్యత ప్రధానమైక కారణంగా ఉంటుంది.

2. సెకండరీ డిస్మనోరియా : వయసు పైబడిన స్త్రీలలో కనిపిస్తుంది. పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు ప్రధానమైన కారణం.

ముఖ్యకారణాలు:

హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ కణుతులు, గర్భాశయ ముఖద్వారం ఇరుకుగా ఉండటం, ఓవేరియన్‌ సిస్టులు.

వ్యాధి లక్షణాలు:

రుతుక్రమ సమయానికి 3 నుంచి 7 రోజుల ముందు నొప్పి మొదలవుతుంది. దీన్ని కంజెస్టివ్‌ డిస్మనోరియా అంటారు. రుతుస్రావం మొదలయిన తరువాత నొప్పి ప్రారంభమై రక్తస్రావం తీవ్రంగా ఉండి ఒకటి రెండు రోజుల వరకు కొనసాగే నొప్పిని స్పాస్‌మోడిస్‌ డిస్మనోరియా అంటారు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు, వెన్నునొప్పికూడా బాధిస్తుంది. విపరీతమైన చిరాకు, కోపం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి.

Related:   గుండె పోటు

తీసుకోవలసిన జాగ్రత్తలు:

హార్మోన్ల సమతుల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి.

ఆయుర్వేద చికిత్స:

రుతుశూలకు ఆయుర్వేదంలో శాశ్వత చికత్స ఉంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే రుతుశూల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన అవసరం లేదు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు. మీ యొక్క సందేహాలను ఇతర వివరాలను అడిగి తెలుసుకునే అవకాశం వుంది.
కాల్ 9949363498

మీ పేరు, వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *