స్త్రీలకు సంసారమే తాజ్ మహల్

0
98

Please View My Other Sites

*స్త్రీలకు సంసారమే తాజ్ మహల్*

వదినగారు…
ఢిల్లీ వెళ్ళానన్నారు కదా!
ఆగ్రా కూడా వెళ్ళారా?
తాజ్ మహల్ చూసేవుంటారు.

ఆగ్రా వెళ్ళానొదినా!
అక్కడ తాజ్ మహల్ కు వెళ్ళేదారిలో అప్పడాలు,పూరీలు వత్తడానికి పాలరాతి పీటలు
యెంత బాగున్నాయో…..
మనవాళ్ళకి వుపయోగమని
రెండు డజన్లు పుచ్చుకున్నాను.
అమాన్ దస్తాలు పాలరాతివి
బుజ్జిముండలు…
యెంత ముద్దొస్తున్నాయో…
కావాలంటే అదికూడా ఒకటి యిస్తాలే…
యింకా కొందును వొదినా…
లగేజీ యెక్కువయిపోతోందంటూ
మీ అన్నయ్యగారు ఒకటే గొడవ.

Also READ:   పిల్ల

మరి ప్రపంచవింత “తాజ్ మహల్” చూడలేదా?

ఏదీ? మేము యింకా షాపింగు చేస్తుండగానే టూరిస్టు బస్సు వాడు”టైమయిపోయిం” దంటూ విజిల్ వేసేసాడు వదినా..
ఇంకేం చూస్తాం! తాజ్ మహల్…
అసలు షాపింగే పూర్తవలేదు…
అయినా తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రాయే వెళ్ళాలా వదినా…
మన పిచ్చిగాని…
మన వంటింటిలో టీ ప్యాకెట్టు మీద రోజూ చూస్తూనే వుంటాంగా “తాజ్ మహల్ ”

ఆఁ!…అవును సుమీ….!!!
😂😂😂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here