స్త్రీలను నెలసరిలో దూరంగావుంచటము మంచిదేనా ?

Spread the love

*స్త్రీలను నెలసరిలో దూరంగావుంచటము మంచిదేనా ?.
**************************
1 స్త్రీ పురుషునికంటే ఎక్కువ పని చేస్తుంది. కనుక నెలలో నాలుగు రోజులు విశ్రాంతి ఇవ్వాలని ఈ ఆచారం పెట్టినట్లు వ్రాసారు అదీ నిజమే
2. ఈమధ్య మహిళా ఖైదీలపై ఒక పరిశీలన జరి పారు. వారి లో ఎక్కువ శాతం నేరస్తులు తామునెలసరి రోజులలో ఉన్నప్పుడే ఈ నేరాలు చేసినట్లు వెల్లడైనది. నెలసరి రోజులలో వుద్రేకము కోపము చికాకు వంటి లక్షణాలు తమలో ఎక్కువగా వుంటాయని వారు వెళ్లడించటమ్ జరిగినది. ఆసమయములో మహిళలకు విశ్రాంతి నివ్వటం మేలనే నేటి మానసికవైద్యుల సలహా గూడా మనపూర్వీకుల వైజ్ఞానిక దృష్టిని తెలుపుతున్నాయి.
3 రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాస్త్రజ్ఞుల పరిశోధన గొప్ప రహస్యాన్ని వెళ్లడించింది. మహిళ లో నెలసరి రోజులలో విడుదలయ్యే హార్మోన్ వలన ఆమె శరీరం చుట్టూ విపరీతముగా బాక్టీరియాలు సూక్ష్మజీవులు వృద్ది పొందుతున్నాయని ,వీనిలో చాలా హానికరమైనవని వారు వెల్లడించారు. అంటే ఇటువంటి వైజ్ఞానిక రహస్యము తెలుసు కనుక మన పెద్దలు వారిని ఇల్లంతా తిరగవద్దని ఒకచోటమాత్రమే వుందాలనే కట్టు బాట్లు పెట్టారు.ఇందువల్ల ఆసూక్ష్మజీవులు అన్ని చోట్లా వ్యాపించకుండా వుండాలనే జాగ్రత్తతో. త్వరగా వీటితాకిడికి గురయ్యే పసిబిడ్డలను కూడా బహిష్టయిన స్త్రీ తాకరాదుఅని,సున్నితమైన పూల మొక్కలను కూడా తాకరాదని నిబంధనలు విధించారు.
4 ఇక వాళ్లకు తామస గుణాన్ని అంటె ఉద్రేకాలను పెంచే కారం ఉప్పు రుచులను తగ్గించి ఆసమయములో సాత్వికమైన తిండి నివ్వటములో ఎంత వైద్య విజ్ఞానము ఇమిడివున్నదో చూశారా! [ఇలా ఐతే మనం ఒప్పుకోము ఏ కార్పోరేట్ గురూజీనో ఇలా తినకూడదు ఉప్పు లేనిది తినాలి అంటే అప్పుడు గౌరవంగా ఆచరిస్తాము.]
5 ఇన్ని వైజ్ఞానిక సూచనలను మనం పైసా ఖర్చుపెట్టకుండా ఇచ్చారు కనుక చాదస్తముగా కొట్టి పారేస్తాము .అదే ఏ కార్పోరేట్ హాస్పటల్ వాల్లో పరీక్షలు జరిపి వచ్చ్న రోగాలు ఈ కారణమేనని చెబితే పేషంట్ లా బుధ్దిగా ఆచరిస్తామేమో.
6 ఇక ఆథ్యాత్మిక విషయాలకొస్తే మనిషిచుట్టూ జీవశక్తివలన ఒక తేజోవలయం వుంటుంది, సాధకులలో ,భగవంతుని ఆశ్రయించిన వారి లో ఈ తేజస్సు ఇంకా ఎక్కువ, అలాగే దైవపూజ జరిగే స్తలాలలో ఈ శక్తి ద్విగుణీకృతమవుతుంది.నెలసరి లోవున్న మహిళలలు ఆప్రాంతములో తిరగటము వలన ఆదివ్యశక్తి క్షీణిస్తుంది. జరగవలసిన మేలు జరుగదు.అంతేకాదు నెలసరి సమయాన సంభోగములో పాల్గొనటము వలన వచ్చే వ్యాధులను ఆయుర్వేదము వివరిస్తున్నది .కనుక వారిని దూరంగా వుంచటము మేలు. ఈ ప్రమాదాలన్నీ గమనించే మనవాళ్ళు ఈ నిబంధనలను విధించారు
మనకు మనపెద్దలు మలవిసర్జనకు వెళ్ళినప్పుడు నీళ్లతో శుభ్రం చేసుకోవాలనే ఆచారం పెట్టారు.మీరుఅనాగరికులు మీకుతెలియదు నాగరికత. మేము చూడు కాగితాలతో తుడుచుకుంటామనే నాగరికులు,వారి భావజాలాలతో ప్రభావితమై మన ఆచారాలను విమర్షిస్తూ ,అసలు మిగతా జీవజాతి మలవిసర్జనతరువాత కడుక్కుంటుందా ? మేము కడుక్కోవలసిన అవసరమేమిటీ మీది మూఢనమ్మకమని వాదించే మేధావివర్గాలను అలానే వర్ధిల్లనివ్వండి.
ఒక్కమనవి వినండి మనపెద్దలు పెట్టిన ఆచారాలన్నీ మానవజీవితానికి ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్నిచ్చేవే వాటిని పాటించటం మనకుమనము చేసుకునే మేలు.అది గమనించండి. వీలుచేసుకుని మన ఆచారాలను మనం పాటిద్దాము మన తరువాత తరానికందిద్దాము తద్వారా మహర్షుల ఆకాంక్షయగు మానవ సౌభాగ్యానికి తోడ్పడదాము.

Also READ:   For children, Those Who Dont Have Children
Updated: July 14, 2018 — 1:03 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *