స్వచ్ఛమైన గాలి

నిన్న ఉదయం టిఫిన్ పెట్టింది మా ఆవిడ…కళ్ళు ఎగరేసి -“ఎలావుందీ” అనింది …..

నోటి తీట కదా …. నేను ….

“స్వచ్ఛమైన గాలిలా ఉంది” అన్నాను…

అనుమానంగా చూస్తూ సన్నగా నవ్వింది…

“బతికామురా నాయన” అని నెమ్మదిగా జారుకున్నా..

ఆదివారం కదా అని , స్నేహితులతో అలా అలా షికారుకి వెళ్లి సాయంత్రం రాగానే మళ్ళీ నెమ్మదిగా, గోముగా అడిగింది …

“మీరు ఉదయం చెప్పింది అర్ధం కాలేదు, ప్లీజ్ ఎంటో చెప్పండి. మీఅంత తెలివి నాకెక్కడిది” అనింది..

నేరుగా వలలో పడిన నేను గర్వంగా

Related:   సెంకడ్_వైఫ్ 

“రంగు ,రుచి,వాసన..లేనిదాన్ని స్వచ్ఛమైన గాలి అంటారు” అన్నాను.. అంటే ఈ మధ్య హోటల్ ఫుడ్ ఎక్కువగా అలవాటైంది . ఎందుకనో అవి రుచి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయ్ , హోటల్ వాళ్లు చెమట చిందించి మరీ తయారు చేస్తారుగా … అందుకేనేమో అంత రుచి …

అంతే ….ఇప్పటికీ ఇంటి బైటే పడి ఉన్నాను ఇంకా….
ఇంటి తలుపు తీలేదు..ఎందుకో…..
??????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *