96 సినిమాను టచ్ చేయొద్దని దిల్ రాజుకి చెప్పా..కాని!: హీరో నాని

Advertisement


కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి వెళ్లిపోతాం.. అయితే కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి తీసుకుని వెళ్తాం. జాను సినిమాను ఇంటికి తీసుకుని వెళ్లే మూవీ అన్నారు నేచురల్ స్టార్ నాని. శర్వానంద్, సమంత జోడీగా నటించిన ‘జాను’ మూవీ ఈనెల 7న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. ‘జాను ప్రీ రిలీజ్‌లో ఆడియన్స్ నుంచి మంచి ఎనర్జీ ఉంది. ‘జాను’ మంచి ఫీల్ ఉన్న సినిమా కదా.. ఆడియన్స్ కూడా అలాగే ఉంటారని అనుకున్నా. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. రాజుగారు 96 సినిమాను రీమేక్ చేద్దాం అని డిసైడ్ అయ్యిన ఒపీనియన్ కోసం నాకు చూపించారు. అప్పుడు నేను.. ‘సార్ ఇంత మంచి సినిమా.. విజయ్ సేతుపతి, త్రిషలు ఇంత బాగా చేశారు. దీన్ని టచ్ చేయకండి అన్నాను. ఈ సినిమాపై ఎప్పుడు డిస్కషన్స్ వచ్చినా.. తెలుగుతో తీయకూడదనే చెప్పా.. కాని సమంత, శర్వానంద్ చేస్తున్నారని తెలిసిన రోజు.. తెలుగులో ఎందుకు చేయడం అని అనిపించలేదు.. తెలుగులో ఎప్పుడు చూస్తామా అని అనిపించింది. ఆ నమ్మకం నాకు ట్రైలర్ చూసిన తరువాత మరింత పెరిగిపోయింది.

Read Also:
నాది లవ్ ఫెయిల్యూర్.. అందుకే పెళ్లి చేసుకోలేదు: శర్వానంద్

READ:   వావ్...సెన్సేషనల్ దర్శకుడితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్?

అప్పటి నుండి నా మైండ్‌లో ఉన్న తమిళ 96 మూవీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు జాను అంటే నాకు వీళ్లిద్దరే గుర్తుకువస్తున్నారు. ఫిబ్రవరి 7 నుండి మీకు ఇదే ఫీల్ వస్తుంది. శర్వానంద్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఫస్ట్ ఫ్రెండ్ వాడు. ఈ సినిమా కాన్సెప్ట్ పాత ఫ్రెండ్స్ మళ్లీ కలవడం. నువ్ కూడా సినిమాలు చేసుకోవడమే కాదు.. అప్పుడప్పుడూ పాత ఫ్రెండ్స్‌ని కలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్.

సమంత, శర్వానంద్‌లు పోటీపడి చేశారు. శర్వానంద్ వాడు ఏ సినిమా చేసినాసరే.. ఆ సినిమాకి పేరు వచ్చినా రాకపోయినా వాడికి మాత్రం పేరు వస్తుంది. ఈ సినిమాకి మంచి పెర్ఫామర్ అవసరం అందుకే తమిళ్‌లో విజయ్ సేతుపతిని తీసుకున్నారు.. తెలుగులో శర్వానంద్‌ని అనుకున్నారు.

READ:   శివన్ మూవీ రివ్యూ - Pakka Filmy - Telugu

Read Also:
నేను ఇప్పుడు మాట్లాడను.. ఫిబ్రవరి 7న చెప్తా: సమంత

సమంత గురించి చెప్పాలంటే.. ఎటో వెళ్లిపోయింది మనసు ఈ టైంలో చేస్తే ఓ లెవల్‌లో ఉంటుందని నా ఫీలింగ్. అలాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాం. ప్రతి సంవత్సరం 10 మంచి సినిమాలు ఉంటే.. అందులో సమంత సినిమాలు రెండు మూడు ఉంటాయి. నిర్మాత దిల్ రాజు సంక్రాంతి నుండి కౌంటింగ్ మొదలైంది. ఇప్పుడు ఫిబ్రవరి 7 నుండి కంటిన్యూ అవుతుంది. ఇక మార్చి 25 నుండి నేను చూసుకుంటా. ఈ సినిమా రాజు గారికి బాక్సాఫీస్ మాత్రమే కాదు జీవితంలో గుర్తిండిపోయే సినిమా అవుతుంది.

READ:   10 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబినేషన్.. రజనీ, కమల్ కలిసి సెన్సేషనల్ ప్రాజెక్ట్

కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి వెళ్లిపోతాం.. అయితే కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి తీసుకుని వెళ్తాం. జాను సినిమాను ఇంటికి తీసుకుని వెళ్తాం. ఆ నమ్మకం నాకు ఉంది అంటూ శర్వానంద్‌లో ‘జాను’ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను అతి కష్టం మీద చెప్పించారు నాని. ‘పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్ సొంతం అయితే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే’ అన్న డైలాగ్‌ను ఎలాగో తిప్పలు పడుతూ స్టేజ్ మీద శర్వానంద్ చెప్పగా.. దాన్ని మారుస్తూ.. ‘పది నెలలు కష్టపడి జానును తీసిన ప్రొడ్యుసర్‌కి సొంతం అయితే.. ఫిబ్రవరి 7 నుండి అది చూసి ఎంజాయ్ చేసే మీకందరికీ కూడా సొంతమే’ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు నాని.

nani superb fun with sharwanand at jaanu pre release event

రేయ్ శర్వా.. డైలాగ్ చెప్పరా: ‘జాను’ ప్రీ రిలీజ్‌లో ఆడుకున్న నాని

Loading