A BEAUTIFUL STORY.. ENJOY THIS

0
209

A BEAUTIFUL STORY.. ENJOY THIS

భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ.

భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి?

భగవంతుడు : ఏం జరిగింది…? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ…?

భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని… తొందరగా నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను… అది మ్రోగలేదు… దాంతో నేను లేటుగా లేచాను.

భగవంతుడు : అంతేనా…?

భక్తుడు : ఇంకా ఉంది. ఈ రోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది. దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.

భగవంతుడు : అంతేగా…?

భక్తుడు : అప్పుడేనా…? మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.

Also READ:   5 Great Horror Anthology Movies

భగవంతుడు : సరే..ఇంకా…?

భక్తుడు : పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..స్నేహితుడితో మాట్లాడుతున్న ఫోను సడన్ గా కట్ అవడం…మళ్ళీ చేసేలోపు..బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం…ఏంటివన్నీ…?

భగవంతుడు : అయిపోయాయా…?

భక్తుడు : అసలైంది ఇప్పుడే స్వామీ…! చాలా అలసిపోయి, ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే, సరిగ్గా అప్పుడే ఫ్యాను, ఏ.సి. రెండూ ఒక్కసారే పని చేయకపోవడం… ఎందుకు స్వామీ.. నా మీద ఇంత కక్ష నీకు…?

భగవంతుడు : సరే..! నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను..!

Please View My Other Sites

ఇవాళ ప్రొద్దున్న అలార్మ్ మ్రోగితే నువ్వు వెంటనే స్నానానికని బాత్రూమ్ కు వెళ్ళేవాడివి. కానీ..ఆ సమయంలో అక్కడ ఒక నల్ల త్రాచు పడగవిప్పి సిద్ధంగా ఉంది. అందుకే అది వెళ్ళిపోయాక నువ్వు మేల్కోవాలని, అలార్మ్ మ్రోగనివ్వలేదు.

Also READ:   ఎ ఆవ్ రా బా వా

కారు మొరాయించకుండా ముందే బయల్దేరి వుంటే ఒక త్రాగుబోతు నడుపుతున్న ట్రక్కు వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగేది.

ఇక భోజనమంటావా…నువ్వెళ్ళిన సమయంలోనే అక్కడి వంటవారు సాంబారులో ఒక బల్లిని గమనించారు…దాంతో ఆ మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, మళ్ళీ సాంబారు కాచి వడ్డించడం వల్ల లేటయ్యింది.

కారులో నీతో ఫోను మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు. ఆ కుట్రలో భాగమే ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు.
చివరిగా…ఫ్యాను, ఏ.సి. అంటావా… అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యుట్ జరిగి.. ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది. అవసరమంటావా…చెప్పు ?

Also READ:   విమానం లో భోజనం

భక్తుడు : స్వామీ…నా అజ్ఞానాన్ని మన్నించు. నన్ను కాపాడడానికే ఇవన్నీ చేసావని అర్ధం చేసుకోలేక నిన్ను నిందించాను. క్షమించు స్వామీ..!

భగవంతుడు : క్షమాపణ అడగడం కాదు… నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో..! ఏం జరిగినా… మన మంచికే అనుకోవాలి. మీ దగ్గర ప్రణాళికలెన్ని ఉన్నా.., మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళిక నేనెప్పుడో సిద్ధం చేసి ఉంచాను.

ఈ సంభాషణని సరిగ్గ అర్థంచేసుకోగలిగితే మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది.

సర్వేజనా సృజనో భవంతు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here