అల్లం చారు

0
183

అల్లం చారు:
కావలసిన పదార్థాలు :
టమాటాలు- 2,
పచ్చిమిర్చి -1/2,
అల్లం – 1 అంగుళం,
చింతపండు – 1/2 నిమ్మకాయ అంత ,
కొత్తిమీర – 2 రెమ్మలు,
రసం పొడి – 1 టీస్పూన్,
పసుపు -చిటికెడు,
ఉప్పు -తగినంత,
నీళ్లు – 3 కప్పులు.

తాలింపు కొరకు:
కరివేపాకు- 2 రెమ్మలు ,
ఎండుమిర్చి -2,
జీలకర్ర – 1/4 టీస్పూన్,
ఆవాలు – 1/4 టీస్పూన్,
ఇంగువ – చిటికెడు,
పచ్చిపప్పు – 1/2 టీస్పూను,
నూనె- 2 స్పూన్,
వెల్లుల్లి -2/3.

Also READ:   కారం పెసర్లు

Please View My Other Sites

తయారీ విధానం :
ముందుగా గిన్నెలో టమాటా ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ,కొత్తిమీర ,రసం పొడి ,పసుపు ,ఉప్పు మరియు చింతపండు వేసి బాగా పిసకాలి. తరువాత ఆ మిశ్రమంలో నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టుకోవాలి. 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి.
తరువాత కడాయిలో నూనె పోసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిపప్పు మరియు దంచిన వెల్లిలుని వేసి బాగా వేయించుకోవాలి. తాలింపుని చారులో వేసుకుని 1 నిమిషం మరిగించి సర్వ్ చేసుకోడమే.

Also READ:   తోటకూర పులుసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here