కలబంద చర్మ సౌందర్యం కొరకు

కలబంద చర్మ సౌందర్యం కొరకు:

××××××××××××××××××××

కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం చేస్తుంది.

కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.
సన్ ట్యాన్‌ రిమూవల్‌ ప్యాక్‌:
సహజమైన చర్మపు మెరుపును పోగొట్టి రంగు తగ్గిస్తుంది ట్యాన్‌. అలొవెరా జెల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం వెలుగును సంతరించుకుంటుంది.
పిగ్మెంటేషన్‌ తొలగాలంటే:
ముఖ చర్మం మీద చోటుచేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖంపై రాయాలి. బాగా ఆరాక వేళ్లతో వలయాకారంలో రుద్దుతూ కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే పిగ్మెంటేషన్‌, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి.
ఆయిలీ స్కిన్‌ ఉంటే…
కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.
సున్నితమైన చర్మానికి…
అలోవెరా జెల్‌, కీరా రసం, పెరుగు, రోజ్‌ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్‌, మురికి వదిలించటంలో ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది.
పొడి చర్మానికి…
అలోవెరా జెల్‌, కాటేజ్‌ చీజ్‌, ఖర్జూరం, కీర దోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. దీనికి నిమ్మ రసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్‌ వారానికోసారి వేసుకోవాలి.
డిటాక్సిఫికేషన్‌ ఫేస్‌ప్యాక్‌:

Related:   BEST HAIR GROWTH OIL FOR BALD HEAD

చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
అలోవెరా స్క్రబ్‌:
చర్మపు మృతకణాలు తొలి

గి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌లను ఎక్కువ మొత్తంలో తయారుచేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవెరా జెల్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవటం వల్ల బ్యూటీపార్లర్‌ ఖర్చు తగ్గటంతోపాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం సొంతమవుతుంది.
కలబందతో ఆయుర్వేదం;
కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం

కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Related:   5_Natural_tips_to_prevent_hair_loss

కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.

కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.

కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.

కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.

కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.

రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.

కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.

కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.

చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.

కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.

పంటి నొప్పి ,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని ,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.

Related:   Pimples ki alage face glow ki remedy

దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.

కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.

అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.

చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.

కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.

ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.

కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.

More about  aloe vera

Read More:

 

2 Comments on “కలబంద చర్మ సౌందర్యం కొరకు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *