కలబంద

Spread the love

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:

కలబంద 

**********

ఒక రకమైన ఔషధ మొక్కలు.

ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొనే సాధారణ మొక్కలే కాకుండా..ఔషధ మొక్కలను పెంచుకొనే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి.[1]

ఉపయోగాలు 
దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు.
దీనితో లోషన్లు, యోగర్ట్స్‌ క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు.
జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.
కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉన్నది. అలోయిన్ నందు
తాజా కలబంద గుజ్జు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.[3]
పెంచుకొనే విధానం[4]
చర్మ సౌందర్యం కొరకు[5]సవరించు
కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం చేస్తుంది.
కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.
సన్ ట్యాన్‌ రిమూవల్‌6 ప్యాక్
సహజమైన చర్మపు మెరుపును పోగొట్టి రంగు తగ్గిస్తుంది ట్యాన్‌. అలొవెరా జెల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం వెలుగును సంతరించుకుంటుంది.
పిగ్మెంటేషన్‌ తొలగాలంటే
ముఖ చర్మం మీద చోటుచేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖంపై రాయాలి. బాగా ఆరాక వేళ్లతో వలయాకారంలో రుద్దుతూ కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే పిగ్మెంటేషన్‌, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి.
ఆయిలీ స్కిన్‌ ఉంటే.
కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.
సున్నితమైన చర్మానికి.
అలోవెరా జెల్‌, కీరా రసం, పెరుగు, రోజ్‌ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్‌, మురికి వదిలించటంలో ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది.
పొడి చర్మానికి.
అలోవెరా జెల్‌, కాటేజ్‌ చీజ్‌, ఖర్జూరం, కీర దోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. దీనికి నిమ్మ రసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్‌ వారానికోసారి వేసుకోవాలి.
డిటాక్సిఫికేషన్‌ ఫేస్‌ప్యాక్‌సవరించు
చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
అలోవెరా స్క్రబ్
చర్మపు మృతకణాలు తొలిగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌లను ఎక్కువ మొత్తంలో తయారుచేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవెరా జెల్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవటం వల్ల బ్యూటీపార్లర్‌ ఖర్చు తగ్గటంతోపాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం సొంతమవుతుంది.
దంత క్షయ నివారిణిగా[6]సవరించు
నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద జెల్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
సాధారణ టూత్‌పేస్ట్‌లు కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్‌ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్‌తో తయారైన పేస్టులతో పళ్లు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా కలబంద గుజ్జు మధుమేహం,కీళ్లనొప్పులు, జీర్ణకోశ,స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాన్నలా పక్కనబెడితే…..కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగటం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జ్యూస్‌లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి.
కలబంద నూనె
కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెండ్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.
తయారూ విధాన0
కలబంద గుజ్జు పావు కిలో తీలుకోవాలి.
కొబ్బరి నూనె పావు కిలో తీసుకోవాలి.
కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి,ముద్దలుగా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
ఒక బాండిలో కొబ్బరి నూనెను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె మాత్రమే మిగులుతుంది.
దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన పరవాలేదు .
ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి .
కలబందతో ఆయుర్వేదం
కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం
కలబంద గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని,ఆరోగ్యాన్ని పొందవచ్చు.
కలబంద రసం,పాలు,నీళ్ళతో కలిపి సేవిస్తే,సెగ రోగం,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.
కలబంద గుజ్జును ఉడికించి వాపులు,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
కలబంద రసం లేదా వేరును పసుపుతో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.
కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు,సూర్య తాపము వలన,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.
చర్మ సౌందర్యానికి,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.
కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.
పంటి నొప్పి,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
దగ్గు నివారణకై 1 స్పూన్,మిరియాలు 1/4 స్పూన్, శొంటి 1/4 స్పూన్,తేనెలో కలిపి సేవించాలి.
కడుపు నొప్పి లోను,కడుపులో గ్యాస్ ఏర్పడినపుడు,గోధుమ పిండి,కలబంద గుజ్జు పై వాము,సైంధవ లవణము,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.
అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.
చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.
కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.
ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.
కలబంద గుజ్జును నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.

Also READ:   పంటిపై గల మచ్చలు తొలగిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ దివ్యౌషధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *