Amma Rajyamlo Kadapa Biddalu ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ పేరు మార్పు.. కొత్త టైటిల్ ప్రకటించిన వర్మ

0
10


ఎట్టకేలకు వర్మ దిగిరాకతప్పలేదు.. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌ను మార్చుతూ ప్రకటన చేశారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇదే టైటిల్‌తో సెన్సార్‌కు వెళ్లితే తిరస్కరణ తప్పదనే భావనతో టైటిల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.


‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. రేపు సెన్సార్‌కు వెళ్తున్న ఈ సినిమాను వివాదాలు చుట్టేశాయి. ముఖ్యంగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌లే వివాదం కావడంతో ఈ టైటిల్ మార్పుతో రేపు సెన్సార్ బోర్డ్‌కు వెళ్తున్నారు వర్మ.

Also READ:   కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్ - All Time Report

Please View My Other Sites

కాగా ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ ఈ సినిమాను రూపొందించడంతో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలపై గుర్రుగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక విడుదలకు మధ్యలో ఒకే రోజు సమయం ఉండటం.. సెన్సార్ కార్యక్రమాలు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వర్మ గత సినిమాల మాదిరే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? లేక సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also READ:   తమన్నా, నందిత శ్వేత, తాప్సి.. తాజాగా ఆ లిస్టులో కాజల్! | Kajal Aggarwal Replaced In Tamannaah Role..?