సంక్రాంతి స్పెషల్. తమిళనాడు స్పెషల్ . అశోకా హల్వా

Spread the love

సంక్రాంతి స్పెషల్.

తమిళనాడు స్పెషల్ .

అశోకా హల్వా .

కావలసినవి .

చాయ పెసరపప్పు — ఒక కప్పు
గోధుమ పిండి — రెండు స్పూన్లు
యాలకులు — 5 మెత్తగా పొడి చేసుకోవాలి.
పంచదార — ఒక కప్పున్నర
నెయ్యి — ఒక కప్పు
జీడిపప్పు — 15 పలుకులు .

తయారీ విధానము .

స్టౌ వెలిగించి బాండీ పెట్టి కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

Also READ:   సాంబార్

తర్వాత కుక్కర్లో గిన్నె పెట్టి వేయించిన పప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి .

తర్వాత మెత్తగా పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా ప్లేటులో తీసుకుని ఉంచుకోవాలి .

తర్వాత అదే బాండీలో మరో స్పూను నెయ్యి వేసి గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టు కోవాలి .

Also READ:   పనీర్ బటర్ మసాల

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర పడి ఉడుకుతుండగానే పది నిముషాల తర్వాత వేయించిన గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని మిఠాయి రంగు కొద్దిగా పాలల్లో కలుపుకుని ఉడుకుతున్న హల్వాలో పోసి గరిటతో బాగా కలుపుకోవాలి .

తర్వాత మిగిలిన నెయ్యి , జీడిపప్పు పలుకులు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .

Also READ:   వేడి  ఉల్లి  పకోడీలు

అంతే ఎంతో రుచిగా ఉండే తమిళనాడు స్పెషల్ అశోకా హల్వా సర్వింగ్ కు సిద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *