కేరళ వారి వంటకం – అవియళ్

అవియళ్ .

అవియళ్ కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు కావున చాలా బలవర్ధకమైన వంటకము అవియళ్.

కేరళ ప్రాంతంలో వారు అన్ని వంటలకు కొబ్బరి నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి మనం కూడా కొబ్బరి నూనె వాడితేనే మంచిది.

ఒకవేళ కొబ్బరి నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నూనె వాడకండి .

దాని బదులుగా నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్ కు కావలసిన వస్తువులు మరియు తయారు చేయు విధానము గురించి తెలుసుకుందాము.

కావలసినవి .

బూడిద గుమ్మడికాయ — ఒక ముక్క .( పై చెక్కు తీసుకొని ముక్కలుగా తరుగు కోవాలి . )

బంగాళా దుంపలు — రెండు.( పై చెక్కు తీసి ముక్కలుగా చేసుకోవాలి )

క్యారెట్ — రెండు . ( పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి . )

బీన్స్ — 50 గ్రాములు . ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి . )

Related:   పచ్చి చింతకాయ పచ్చడి

ములక్కాడలు — 2
( ముక్కలుగా కట్ చేసుకోవాలి . )

ఆనపకాయ లేదా సొరకాయ — ఒక ముక్క . ( పై చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి )

అరటికాయ — పెద్దది ఒకటి . ( చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి )

దొండకాయలు — 8 ( ముక్కలుగా తరుగు కోవాలి .)

పచ్చి బఠాని గింజలు — అర కప్పు .

కొత్తిమీర — ఒక కట్ట . ( సన్నగా తరుగు కోవాలి .)

కరివేపాకు — మూడు రెమ్మలు .

కొబ్బరి నూనె లేదా / నెయ్యి — ఆరు స్పూన్లు

కొబ్బరి కాయ — 1 ( రెండు చిప్పలు కోరాముతో తురుము కోవాలి . )

గట్టి పెరుగు — అర లీటరు . ( పుల్లగా ఉంటే బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర — స్పూను

పచ్చి మిరపకాయలు — 8

పోపునకు .

ఎండుమిరపకాయలు — 4 ( ముక్కలుగా చేసుకోవాలి )
ఆవాలు — అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా తరిగి సిద్ధంగా ఉంచుకున్న ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు ఒక గిన్నెలో వేసుకుని సరిపడా ఉప్పు మరియు నీళ్ళు పోసుకుని కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చి దింపుకుని కొద్దిగా నీరు ఉంటే గిన్నెలో అలాగే ఉంచుకోవాలి .

Related:   మామిడి అల్లం పచ్చడి

తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని మరియు కొద్దిగా నీళ్ళు పోసుకుని మరీ పల్చగా కాకుండా ముద్దలా వేసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద ఉడికిన నీళ్ళతో ఉన్న ముక్కల గిన్నెను పెట్టి , అందులో మిక్సీ వేసుకున్న కొబ్బరి ముద్దను వేసి , ముక్కలు ముద్ద బాగా దగ్గర పడి కలిసి పోయేలా ఓ పది నిముషాలు ముద్ద పచ్చి వాసన పోయేదాకా ఉడకనివ్వాలి .

ఆ తర్వాత ముక్కలతో ఉడికిన మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి .

వేడి మీద పెరుగు కలిపితే విరిగి పోతుంది .

తర్వాత పెరుగును గరిటతో బాగా కలుపుకుని ఈ ముక్కలలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు వేసుకుని పోపు వేసుకుని ఈ పెరుగు కలిపిన ముక్కలలో వేసుకోవాలి .

Related:   బెండకాయ మసాలా కూర

తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే అవియళ్ చపాతీల లోకి , భోజనము లోకి , చివరికి వట్టిగా తినడానికి కూడా సర్వింగ్ కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు వంటివి ఇందులో బాగుండదు .

ఇంగువ , ఎండు కారము వంటివి వేసినా బాగుండవు .

ఎంత కమ్మగా ఉంటే అవియళ్ అంత రుచిగా ఉంటుంది .

ఎవరైనా అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు మరియు ప్రత్యేక సందర్భాలలో ఈ అవియళ్ తయారు చేసుకుంటే చాలా కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం తెస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *