వేయించిన శనగపప్పు తో చక్కిలాలు

వేయించిన శనగపప్పు తో చక్కిలాలు.

కావలసినవి .

బియ్యపు పిండి — రెండు కప్పులు.
వేయించిన శనగపప్పు పిండి —
ఒక కప్పు

ఈ పిండి మిక్సీలో వేసుకోవచ్చు .

మిక్సీ లో వేసుకునేటప్పుడు పప్పు లోనే సరిపడా ఉప్పు , అర స్పూను వాము , పావు స్పూను జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

వెన్న — రెండు స్పూన్లు

వెన్న దొరకని యెడల నాలుగు స్పూన్లు కాచిన నెయ్యి వేసుకోవాలి .

కారం — స్పూను

ఇంగువ — పావు స్పూను లో సగం .

నూనె — అరకిలో .

తయారీ విధానము .

ఒక బెసిన్లో వేయించిన శనగపప్పు పొడి ( జీలకర్ర , వాము తో వేసినది ) , బియ్యపు పిండి , కారం, ఇంగువ , వేసుకుని చేతితో బాగా కలుపు కోవాలి . అందులో వెన్న కానీ కాగే నెయ్యి కాని పోసి బాగా కలుపు కోవాలి .

Related:   పెసర పచ్చడి

ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ చక్కిలాలు వేయటానికి వీలుగా కలుపుకోవాలి .

తర్వాత బాగా పిండిని మెదాయించుకోవాలి.

ఇప్పుడు స్టౌ వెలిగించి బాండి పెట్టుకుని మొత్తము అర కిలో నూనె పోసి నూనెను పొగలు వచ్చే విధముగా బాగా కాగనివ్వాలి.

తర్వాత పిండిని చక్కిలాలు వేసే గిద్దలో పెట్టుకుని స్టౌ మీడియం సెగలో పెట్టి రెండు రెండు చొప్పున చక్రాలు వేసుకుని బంగారు రంగులో వేయించుకుని తీసేసుకోవాలి .

అంతే వేయించిన శనగపప్పు తో చక్కిలాలు సర్వింగ్ కు సిద్ధం.

ఈ చక్కిలాలు పది రోజులు నిల్వ ఉంటాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *