Drunk & Drive

Spread the love

Drunk & Drive ?

అనగనగా….
ఒక రాత్రి Jubilee hills వైపునుంచీ వస్తున్న ఓ కారును పోలీసులు ఆపారు.

కారు నడుపుతున్న మహిళ నోటి దగ్గర గొట్టం పెట్టి ఊదమన్నారు.

ఆవిడ పక్కన కూర్చున్న భర్తవైపు చూసి… మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఊదారు.

మీటరు గిర్రున తిరిగింది.

భర్త చాలా రాష్గా డోరు తెరుచుకుని దిగాడు.

మీ మిషన్ పనిచేయడం లేదు… తాగింది నేను…
ఆవిడ కాదు అని అరుస్తూ మిషన్ లాక్కుని కిందేసి కొట్టాడు.

Also READ:   స్త్రీలకు సంసారమే తాజ్ మహల్

పిచ్చిగా మాట్లాడకు.. ఆవిడా తాగే ఉన్నారు అన్నాడు కానిస్టేబుల్.

నో… అని అరిచాడు భర్త.

ఆవిడ్నే అడిగన్నాడు ఏ మాత్రం బెదరకుండా కానిస్టేబుల్.

భర్త భార్య వైపు చూసాడు….

ఆవిడ సజయ నయనాలతో భర్త పాదాలకు నమస్కరించారు.

ఇందాక మీరు… ఆ హోటల్ గదిలో ఫుల్లు తాగలేదండి… సగమే తాగి పడిపోయారు.
ఆ మిగిలింది వేస్టు చేయడం ఎందుకని నేను తాగేసానండి… అని ముగించింది.

హాఫ్ తాగి ఆయన పడిపోతే మిగిలింది తాగి ఆయన్ని తీసుకుని ఇంతదూరం కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారా అమ్మా అని దణ్ణం పెట్టాడు కానిస్టేబుల్.

Also READ:   వరం

మందు వృధా కాకూడదు… ఆయనకేం కాకూడదు…
అంతే ఆ క్షణంలో నా మనస్సులో ఉంది… ఆ మనో నిశ్చయమే ఇక్కడదాకా తీసుకొచ్చింది…

నేనే కాదు నా స్థానంలో ఏ పతివ్రత ఉన్నా ఇలానే చేస్తుంది అంటూ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది.

ఆవిడ మాటలకు కళ్ళు చెమర్చిన కానిస్టేబుల్ దణ్ణం పెట్టి మీరు వెళ్ళండమ్మా…

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఓ మహా పతివ్రత దర్శనం అయ్యింది అనుకున్నాడు.

కారు సర్రున దూసుకెళ్ళిపోయింది…????

Also READ:   కొత్తగా పెళ్లయిన జంట

Updated: July 12, 2019 — 8:01 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *