చలికాలం చర్మం పొడిబారకుండా

• చలికాలం చర్మం పొడిబారకుండా…!
శీతాకాలం ఎక్కువగా వేధించే సమస్య పొడిచర్మం. కారణం.. వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం.. కొంత వరకూ వయసు కూడా! చలికాలం ఒంట్లో తేమ తగ్గి చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. 
అలా కాకుండా చర్మం మృదువుగా ఉండాలంటే…
 * మనం ముందుగా చేయాల్సిన పని.. చర్మానికి తేమను అందించడం లేదా చర్మం తేమను కోల్పోకుండా చూడ్డం. పెట్రోలియం జెల్లీ, మినరల్‌ ఆయిల్స్‌ వంటివి ఇందుకు సహకరిస్తాయి. వీటిని పైపూతగా ఉపయోగించడం వల్ల చర్మం తేమతో నిగారిస్తుంది.
* చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు గదిలో హ్యుమిడిఫైయర్లను ఉంచితే చర్మం పాడవ్వకుండా ఉంటుంది.
* గంటల కొద్దీ స్నానం చేయకుండా పది నిమిషాల్లో, అదీ వేడివేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం ముగించేయాలి. లేకపోతే చర్మంలోని సహజసిద్ధమైన నూనెలని కోల్పోయే అవకాశం ఎక్కువ. ఆ నూనెలు తొలగిపోతే చర్మం పొడిగా మారుతుంది.
* సబ్బు వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది. తప్పనిసరై వాడాల్సి వచ్చినా.. తేమ శాతం ఎక్కువ ఉండేవి ఆల్కహాల్‌, గాఢత లేనివి వాడాలి.
* స్నానం చేసి వచ్చిన వెంటనే శరీరం పూర్తిగా తడారక ముందే కాళ్లూ, చేతులకు మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలా అయితే తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
… సంప్రదాయ వైద్యం

Related:   How To Make Orange Oil For Lightening And Glowing Skin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *