Frozen II: సరికొత్త రంగుల ప్రపంచాన్ని సృష్టించాం.. కొత్తగా ప్రేక్షకుల అనుభూతి

0
4


bredcrumb

Hollywood

oi-Rajababu A

|

ఫ్రోజెన్ చిత్రంలో మంచుతో కూడిన అతీంద్రియ శక్తులు ఉన్న హీరోయిన్ పాత్ర కోసం వాతావరణం సృష్టించడం అంత సులభమైన పనికాదనే అందరికీ తెలిసిందే. కానీ దట్టంగా మంచు కురిసే శీతాకాలాన్ని ఉత్సాహవంతమైన శరదృతువును ఆహ్లాదకరమైన రంగులతో డిజైన్ చేయడం కత్తి మీద సాము లాంటిదే. అందుకోసం ఎంచుకొనే వర్ణాలు అత్యంత కీలకంగా మారుతాయి. సెట్టింగ్స్, యాక్షన్ సీన్లు, మ్యూజిక్, సౌండ్, రంగుల ఎంపిక లాంటి ఆహ్లాదకరమైన అంశాలు ప్రేక్షకులను సన్నివేశాల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి.

అయితే ప్రతీ అంశాలు స్థూలంగా సినిమాను, సన్నివేశాలను ఆకర్షణీయంగా మార్చుతాయి. ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా శరద్ బుుతువులోని అడవి నేపథ్యం తదితర ఇతర అంశాలు కథ బలంగా మారేందుకు ఉపయోగ పడుతాయి. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రకాశవంతమైన రంగులు, హీరోయిన్‌ పాత్రకు సంబంధించిన అంశాలు ప్రొడక్షన్ డిజైనర్లు దృష్టిలో పెట్టుకోవడం జరిగింది.

Also READ:   ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: పవన్ కొత్త సినిమా ప్రకటన ఆరోజే.. బయటకొచ్చిన దర్శక నిర్మాతల పేర్లు.! | Pawan Kalyan Re entry To Tollywood.. Director also Final

నార్వే, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్ లాంటి అందమైన ప్రదేశాల్లో, ప్రజల, సంస్కృతుల మధ్య సన్నివేశాలను ఆహ్లాదకరంగా చిత్రీకరించేందుకు చమటోడ్చాం అని చిత్ర యూనిట్ చెప్పింది. ప్రొడక్షన్ డిజైనర్ మైఖేల్ గియామో మాట్లాడుతూ.. ఎరుపు, పసుపు రంగుల మిశ్రమాలతో శరదృతువును అందంగా ఫ్రొజెన్ కోసం చిత్రీకరించాం అని తెలిపారు.

 Arendelle designed as distinctive world for Frozen II

గ్రీష్మ బుుతువులో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచమంతా రంగుల మయంగా కనిపిస్తుంది. అలాంటి వాతవరణం పాత్రలను మరింత హైలెట్ చేస్తుంది. సరికొత్త ప్రదేశం, సమయాన్ని గుర్తు చేస్తుందనే భావనతో ఉన్నాను అని మైఖేల్ గియామో తెలిపారు. అలాంటి గ్రీష్మ బుుతువు వాతావారణాన్ని ఫ్రోజెన్ కోసం చక్కగా చిత్రీకరించాం. పసుపు రంగును తగ్గించి ఆరెంజ్, ఆరెంజ్-ఎరుపు, ఎరుపు-ఉదారంగు లాంటి కలర్లను వాడుకొన్నాం. మన ప్రపంచానికి విభిన్నంగా కనిపించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశాం. అరెండెల్లే లాంటి సామ్రాజ్యంలో శీతాకాల వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా తెరమీద ప్రతిబింబించేలా డిజైన్ చేశాం. వాతావారణ మార్పు అంశం మాకు పెద్ద సవాళులుగా నిలిచింది. కొత్త నేపథ్యంతో భవనాల సౌందర్యానికి ఎలాంటి సమస్య రాకుండా, వృక్షాలు, ఆకులు అందంగా డెకరెట్ చేశాం తెలిపారు.

Also READ:   RRR నుంచి సెన్సేషనల్ అప్‌డేట్: పోలీస్‌ పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్.. అసలు కారణం ఇదే.!

డైరెక్టర్ ఆఫ్ ఎన్వీరాన్‌మెంట్స్ డేవిడ్ వోమెర్‌స్లీ మాట్లాడుతూ.. ఓ పక్కన మంచు కురుస్తుంటే.. వాటితో పాటు కొన్ని రాజ భవనాలను వాస్తవికత ఉట్టిపడేలా డిజైన్ చేశాం. అవసరమైనప్పుడు కొన్నిసార్లు భవనాలపై నుంచి మంచును తొలగించాం. ఇలా రంగుల సమాహారాన్ని కథకు, సీజన్‌కు తగినట్టుగా వినియోగించుకొన్నాం. దాని ఫలితమే.. ప్రేక్షకుడు సరికొత్త లోకాన్ని చూస్తున్నామనే అనుభూతిని క్రియేట్ చేశాం. ఇలాంటి అంశాలను వారు గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు.