Gas_Indigestion

0
117

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
9949363498

Gas_Indigestion
××××××××××××××××
1,
శొంటి ,
పిప్పిళ్ళు ,
మిరియాలు,
సైంధవ లవణం ,
తెల్ల జీలకర్ర,
నల్ల జీలకర్ర ,
పొంగించిన ఇంగువ
ఈ 8 పదార్దాలు సమానంగా తీసుకుని దంచి చూర్ణం చేసుకొని , భోజనం చేసేప్పుడు మొదటి ముద్దలో మూడు లేదా 5 గ్రాముల చూర్ణాన్ని తగు మోతాదుగా నెయ్యిని కలిపి తింటూ ఉంటే అజీర్ణ , వాయురోగాలు హరించి పొతాయి. కడుపులో జఠ రాగ్ని ఎల్లప్పుడూ సమంగా ఉండి రక్తవృద్ధి , శరీరపుష్టి కలుగుతాయి.

2′
వాము (ఓమ ) 1౦౦ గ్రా ‘
జీలకర్ర 5౦ గ్రా ‘
శొంఠి. 50 గ్రా
నల్ల ఉప్పు 25 గ్రా ‘

Also READ:   మద్ది చెట్టు ( అర్జున )

తీసుకొని దంచి జల్లించి నిలువ చేసుకోవాలి .
మూడుపూటలు ఆహరం తరువాత చెంచ పొడి ఒక కప్పు గోరు వెచ్చని నీటితో తాగుతుంటే ఉదరం లోని గ్యాస్ తగ్గి పోతుంది .

3,
నోరు రుచి లేకపోవటం (లేదా వాంతులు అయ్యాక నోరు రుచి లేకపోవటం) అనిపిస్తే, ఈ క్రింద చిట్కా ఉపయోగపడుతుంది:
****************************
ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసంలో సరిపోయినంత (మునిగేంత) జీలకర్ర,
అల్లం ముక్కలు చిన్నవి ఆరబెట్టినవి , నల్లుప్పు వేసి ఇవన్ని పీల్చుకునేదాక నానపెట్టాలి. అంతే!

* కొద్దిగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ తినాలి.

Also READ:   DANDRUFF

అజీర్ణ వాయుసమస్యలు
******************
* వాము 100గ్రా
శొంఠి. 100గ్రా
జీలకర్ర. 100గ్రా
నల్లుప్పు 50 గ్రా
అన్ని సమము చూర్ణము 3 పూటలా ఒక స్పూన్ చొప్పున సేవించుతున్న అన్ని ఉదర సమస్యలు తీరును

*జీలకర్ర -100గ్రా,
(దోరగా వేయించి దంచిన పోడి)
ఆవునెయ్యి-100గ్రా,
కలకండ-100గ్రా
ఈ మూడు పదార్థములు తయారు చేసిన లేహ్యం వయస్సును బట్టి మెతాదు తినుచుండిన యడల ఆకలి లేని వారికి ఆకలి కలిగించును. మరియు గర్భాశయము లో,ఆండాశయములో,పవిత్రాంగములో గడ్డలు, యోని మంట,దురద, తగ్గిపోవును., అరుచి,పైత్యం, లాంటివి కూడ తగ్గిపోతాయి.

** మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, వాము,ధనియాలు,జీలకర్ర, నల్లుప్పు, ఉసిరిపోడి,యష్టిమధు, శతావరి,సోంపుగింజలు యివన్నీ సమభాగాలుగా కలిపి చూర్ణలుగా తయారుచేసుకోనవలేను. స్పూన్ సేవించిన యడల కడుపు రోగాలు బంద్,మరియు కడుపులో చెత్తచెదారము,చెడు వాయువులు, కడుపు క్రొవ్వు తగ్గి కడుపు శుద్ది అవుతుంది

Also READ:   ముఖం మీద రంద్రాలను తొలగించుకోవడానికి పాక్స్

Please View My Other Sites

* ఒక చెంచా నిమ్మరసం,
ఒక చెంచా అల్లంరసం,
ఒక చెంచా తేనే కలిపి రోజు రెండు పూటలా ఆహరానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా అద్భుతమైన ఆకలి కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here