నరకం టు నరకం ఫ్రీ

ఒక రాజకీయ నాయకుడు , ఒక దొంగ, భార్య భయస్తుడు ఒకేరోజు మరణించి నరకానికి వెళ్లారు .

వెళ్ళిన దగర నుండి చిత్రగుప్తుడి దగ్గర రాజకీయనాయకుడు నానా గొడవ చేయడం మొదలు పెట్టాడు.

నా పార్టీ వాళ్ళతో చాలా మాట్లాడాలి ఒకసారి ఒక్కసారి ప్లీజ్ అని అని బతిమాలసాగాడు.

డబ్బులిస్తే ” నరక నెట్వర్క్ ” ద్వారా ఫోన్ చేసుకోవచ్చని అక్కడ చిత్రగుప్తుడు చెప్పడంతో మొదట రాజకీయనాయకుడు ఫోన్ చేసుకుని ఐదు నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు.

ఎంత ? అన్నాడు రాజకీయ నాయకుడు .

ఐదు లక్షలు అన్నాడు చిత్ర గుప్త.

వెంటనే రాజకీయ నాయకుడు చెక్ రాసిచ్చి వెళ్ళిపోయాడు .

Related:   💧💧2050 లో వార్తా సమాహారం

ఇదంతా చూస్తున్న దొంగకి ఈర్ష్య కలిగింది .

నేను మా దొంగల గ్రూపుకి ఫోన్ చేసుకోవాలి అని అడిగి ఫోన్ చేసుకుని రెండు నిముషాలు మాట్లాడి పెట్టేశాడు .

ఈసారి అతని వద్ద పది లక్షలు వసూలు చేశాడు చిత్రగుప్తుడు.

ఇప్పుడు భార్య భయస్తుడు ఇంటికి చేసి భార్యకు వంటిల్లు ఇంటి పని కష్టాల గురించి దాదాపు పది గంటలు మాట్లాడాడు .

అంతా అయిపోయాక యెంత అని అడిగాడు చిత్ర గుప్తుడిని.

ఆ పది రూపాయలు అన్నాడు చిత్రగుప్త .

అదేంటి అంత తక్కువ అని ఆశ్చర్య పోయాడు భార్య భయస్తుడు. దానికి చిత్రగుప్తుని సమాధానం … ఇలా ఉంది..

Related:   కొడుకు మిస్సింగ్ జోకు

#నరకం నుండి #నరకానికి లోకల్ కాల్ …
??????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *