Jokes

Spread the love

డైటింగ్

”ఏమండీ… ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?” అంది భార్య భర్తతో

“ఏం.. ఆరు ముక్కలుగా కోస్తే ఇబ్బందేంటో?” ప్రశ్నించాడు భర్త

“వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.??

సుబ్బారావు తల పగిలి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు, తల కి కట్టుకడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్.
సుబ్బారావు : నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది
మా ఆవిడని సర్ ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళగానే రేపటినుంచీ నువ్వు మేనేజర్ తో కాపురం చెయ్యాలోయ్ అన్నాను
అంతే…..???

ఒక నల్లని మనిషి చనిపోయాక
స్వర్గానికి వెళ్లాడు..
దేవకన్య: ఎవరు నువ్వు?
నల్లని వ్యక్తి: (ఆమెని ఇంప్రెస్ చేయడానికి)
‘టైటానిక్’ సినిమాలో హీరోని
దేవకన్య: టైటానిక్ షిప్
మునిగిపోయిందిరా వెధవా.. కాలిపోలేదు!
???????

ఇల్లాలు భర్తతో: పనిచేసేటప్పుడు
నడుము గిల్లకండి అని
ఎన్ని సార్లు చెప్పాలి మీకు?
పనిమనిషి: బాగా బుద్ది
వచ్చేటట్టు చెప్పండమ్మగారు
నేను చెప్పి, చెప్పి అలసిపోయేను!
?????????

Also READ:   జంబులింగం ఆఫీసులో ఉన్నంతసేపు బాగానే ఉంటున్నాడు !?

వాలెంటైన్స్ డే నాడు భర్త భార్యకు
*తెల్ల గులాబి* ఇచ్చాడు.

అదేంటీ గత సంవత్సరం
*ఎర్ర గులాబీ* ఇచ్చారు,
ఇప్పుడు *తెల్ల గులాబీ* ఇస్తున్నారేంటీ?’
అడిగింది భార్య.

‘అప్పుడు ప్రేమ కావాలని ఎర్రగులాబీ ఇచ్చాను. ఇప్పుడు శాంతి కావాలని తెల్లగులాబీ ఇస్తున్నాను. అర్థం చేసుకోవాలి మరి’

-సమాధానమిచ్చాడు భర్త…..??

?? మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది …. ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ”

Also READ:   SAD NEWS

అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .

మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా….
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* ??

అలిగి పుట్టింటికొచ్చిన కూతురు , తిరిగి కాపురానికి వెళ్తుంటే తల్లి అడిగింది…
” ఏమ్మా తప్పు తెల్సుకున్నావా..?? అని.

కూతురు : నిజం తెలుసుకున్నా…
ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది… అక్కడైతే అన్ని పనులు ఆయనే చేస్తారు…
?????

తండ్రి కొడుకుతో కోపంగా..

Also READ:   బిల్ పే

కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా. నీకు కొత్తిమీరకు పుదీనాకూ తేడా తెలియదా..? తాడిచెట్టులా పెరిగితే సరిపోయిందా వెళ్ళు వెళ్ళు. ఇల్లు వదిలి వెళ్ళిపో తెలుస్తుంది జీవితం అంటే ఎంటో..?!

కొడుకు : సరే నాన్న పద ఇద్దరమూ ఇల్లు వదిలి వెళదాం పద..

తండ్రి : ఎందుకు నేనెందుకు..?!

కొడుకు : అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంటా..!!
???

Updated: July 13, 2019 — 12:36 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *