కబీర్ సింగ్ కలెక్షన్ల దుమారం.. సల్మాన్, రణ్‌వీర్ రికార్డులు ఫట్! | Kabir Singh collections: Shahid Kapoor surpasses Salman Khan’s Bharat

Spread the love

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో షాహీద్ కపూర్ కాంబినేషన్‌తో వచ్చిన కబీర్ సింగ్ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్నది. క్రిటిక్స్, సామాజిక కార్యకర్తలు విమర్శలను ఎదురించి ఈ చిత్రం దూసుకెళ్తున్నది. త్వరలోనే ఈ చిత్రంరూ.300 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన అన్ని చిత్రాలను మించి కలెక్షన్లు రాబట్టే దిశగా ఈ సినిమా హంగామా సృష్టిస్తున్నది. ఇటీవల సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో దుమారం సృష్టించడంతో కబీర్ సింగ్‌కు కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. గత 18 రోజుల కబీర్ సింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

Also READ:   ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకానికి శ్రీకారం చుట్టిన మోదీ సర్కార్

ఇక కబీర్ సింగ్ జోరు ఎలా ఉందంటే.. ఈ ఏడాది రిలీజైన సల్మాన్ ఖాన్ నటించి భారత్ చిత్రం కలెక్షన్లను అధిగమించింది. వికీ కౌశల్ నటించిన యూరీ సినిమా వసూళ్లను అధిగమించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం బాహుబలి, దంగల్, పీకే, యూరీ చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది.

జూన్ 21న రిలీజ్ అయిన కబీర్ సింగ్ దిగ్విజయంగా మూడో వారంలోకి ప్రవేశించింది. ఆదివారం రూ.9.61 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. మూడో సోమవారం కూడా ఘనంగా రూ.4.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.239.72 కోట్లు వసూలు చేసింది. ఈ వారంలోనే రూ.250 కోట్ల క్లబ్‌ను దాటేసే అవకాశం ఉంది.

Also READ:   రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామీ వివేకానంద

 

Kabir Singh collections: Shahid Kapoor surpasses Salman Khans Bharat

 

కబీర్ సింగ్ కలెక్షన్లను చూస్తే లాటరీ కొట్టేసినట్టు అనిపిస్తున్నది. ఆశ్చర్యకరమైన వసూళ్లను రాబడుతూ దూసుకెళ్లున్నది. సింబా వసూళ్లపై కన్నేసింది. ఈ చిత్రం శుక్రవారం రూ.5.40 కోట్లు, శనివారం రూ.7.51 కోట్లు, ఆదివారం రూ.9.61 కోట్లు, సోమవారం రూ.4.25 కోట్లతో రూ.239.97 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా రూపొందిన కబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకొంటున్నది.

Also READ:   మా అమ్మ (చీర) కొంగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *