Meeku Maathrame Cheptha Cinema review.. విజయ్ దేవరకొండ నిర్మాతగా

0
60


మీకు మాత్రమే చెప్తా కథే ఏమిటంటే..

అబద్దాలు ఇష్టపడని అమ్మాయి.. ఎప్పుడు అబద్దాలతో జీవితం గడిపే అబ్బాయి ప్రేమలో పడుతారు. చివరకు ప్రేమ పెళ్లి కూడా కూడా ఖాయమవుతుంది. పెళ్లికి ముందు నాకు తెలియని విషయాలు ఉంటే ముందే చెప్పమని ప్రియుడిని ప్రేయసి అడుగుతుంది. కానీ చెబితే ఏం జరుగుతుందో అనే భయంతో ప్రియుడు కొన్ని విషయాలను దాచేస్తాడు. ఆ క్రమంలో పెళ్లికి ప్రియుడికి సంబంధించిన పోర్న్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో బయటకు వస్తుంది.

మీకు మాత్రమే చెప్తా కథలో ట్విస్టులు..

మీకు మాత్రమే చెప్తా కథలో ట్విస్టులు..

యూట్యూబ్‌లో వీడియో బయటకు వచ్చిన సమయంలో ప్రియుడు పడిన తంటాలు ఏమిటి? ఇంతకు ఆ పోర్న్ వీడియోను ఎవరు అప్‌లోడ్ చేశారు? పెళ్లికి ముందు వీడియో గురించి తెలిసిన ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? ఇంతకు బయటకు వచ్చిన వీడియో కామేష్ (అభివవ్ గోమఠం), విక్కి (తరుణ్ భాస్కర్)‌‌దా? ఈ కథలో అనసూయ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉంది. స్టెఫీ (వాణి భోజన్) పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారింది అనే ప్రశ్నలకు సమాధానమే మీకు మాత్రమే చెబుతా.

ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

ఓ టెలివిజన్ ఛానెల్‌లో పనిచేసే వికీ, కాము పాత్రలతో కథ మొదలవుతుంది. వీరి జీవితంలో పోర్న్ వీడియో ప్రవేశించన తర్వాత వారికి ఎదురయ్యే పరిస్టితులు.. ఆ వీడియోను య్యూట్యూబ్ నుంచి డిలీట్ చేసే ప్రాసెస్‌తో కథ ముందుకు వెళ్తుంది. కథనంలో హస్యానికి పెద్ద పీట వేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. కానీ అంత ఎఫెక్టివ్‌గా ప్రేక్షకుడిని కదిలించలేకపోయింది. కొన్ని సీన్లు బాగుండటం, మరికొన్ని సీన్లు ఒకేలా ఉండటం, ఇంకొన్ని సీన్లు నాసిరకంగా ఉండటంతో తొలిభాగం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్‌ మాత్రమే కథను భుజాన వేసుకోవడంతో మిగితా పాత్రలు మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది.

Also READ:   ‘కథనం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Kathanam movie review and rating
-->

సెకండాఫ్‌ అనాలిసిస్

సెకండాఫ్‌ అనాలిసిస్

ఇక సెకండాఫ్‌లో పోర్న్ చుట్టే తిరగడం కాస్త రొటీన్‌గా మారిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌లో అభినవ్, తరుణ్ భాస్కర్ పాత్రలకు సంబంధించి అనూహ్యమైన ఓ ట్విస్ట్ రావడంతో కథలో వేగం పుంజుకొంటుంది. ఇక చివర్లలో అనసూయ పాత్రతో చిన్న మ్యాజిక్ క్రియేట్ చేయడంతో అప్పటి వరకు కథలో ఉన్న నిస్తేజం తొలిగిపోయి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారుతుంది. ఓవరాల్‌గా కాన్సెప్ట్ బేస్డ్‌గా సాగే ఈ కథకు కొన్ని పాత్రల ఫెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణ కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

దర్శకుడిగా షమీర్ సుల్తాన్

దర్శకుడిగా షమీర్ సుల్తాన్

షమీర్ సుల్తాన్ దర్శకుడిగా ఎంచుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని పూర్తిస్థాయి సన్నివేశాలుగా మార్చి వేగంగా నడిపించడంలో తడబాటు కనిపించింది. కేవలం మూడు నాలుగు పాత్రల మధ్య కథ సాగడం ఒకే రకమైన సీన్లు తెరపైన కదలాడినట్టు కనిపిస్తుంది. అయితే యూత్ ఫుల్‌ అంశాలతో ఆ లోటు అధిగమించడం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కామెడీ ప్రధానంగా సాగే సీన్లలో కొంత డోస్ పెంచితే కథ బలహీనతను పూడ్చే అవకాశం ఉండేది. కథలో దమ్ము లేకపోవడం, స్క్రీన్ ప్లే వీక్‌గా ఉండటం కొంత మైనస్. అయితే కొత్తవారితో మంచి అవుట్‌పుట్ సాధించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

హీరోలు అభినయ్, తరుణ్

హీరోలు అభినయ్, తరుణ్

ఇక హీరో, హీరోయిన్ల పాత్రల విషయానికి వస్తే.. అభినవ్ గోమఠం యాక్టింగ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాను పూర్తిగా తన భుజాన వేసుకొని భారాన్ని మోసిన పాత్రగా తెర మీద కనిపిస్తుంది. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకుడినే కాదు.. యాక్టర్‌గా చూపించిన వేరియేషన్స్ సూపర్బ్. పలు సమస్యలతో నలిగిపోయే యువకుడి పాత్రలో జీవించాడనే చెప్పవచ్చు. విలన్ టచ్‌తో నటుడు వినయ్ వర్మ ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

Also READ:   నేను లేను మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | nenu lenu movie review and rating
-->

వాణి, పావని, అనసూయ క్యారెక్టర్ల గురించి

వాణి, పావని, అనసూయ క్యారెక్టర్ల గురించి

హీరోయిన్లలో వాణి, పావని గంగిరెడ్డి పాత్రలు ఎలివేట్ కాలేకపోయాయి. ఎప్పడూ వాణి పాత్ర చిరాకుతోనే కనిపించడం తప్ప మరోటి కనిపించదు. హీరోయిన్ పెదవి మీద కనీసం చిరునవ్వు కూడా లేకపోవడాన్ని బట్టి ఆ పాత్ర ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పావని గ్లామరస్‌గా కనిపించానా.. పాత్రకు స్కోప్ లేదు. ఇక అనసూయ పాత్ర అతిథి పాత్రనే. కాకపోతే చిన్న మ్యాజిక్ ఉన్న రోల్‌లో తనదైన ముద్రను వేశారు. అనసూయ గ్లామర్‌కు దూరంగా ఉండే పాత్రలో కనిపించడం సగటు సినీ అభిమానికి మింగుడు పడని విషయమే అనే చెప్పవచ్చు.

సాంకేతిక అంశాలు..

సాంకేతిక అంశాలు..

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. గుణదేవ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, లొకేషన్స్‌ ఎంపిక సీన్లకు బలంగా మారింది. ఇక స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కథకు, సన్నివేశాలకు శివకుమార్ మ్యూజిక్ అదనపు బలంగా మారింది. ఎండ్ టైటిల్స్‌లో విజయ్ దేవరకొండపై వచ్చే పాటకు కొరియోగ్రఫి, చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్‌కు ఇంకా కొంత అవకాశం ఉంది. మిగితా డిపార్ట్‌మెంట్స్ తమ పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

కొత్త కళాకారులకు చేయూత అందించాలనే విజయ్ దేవరకొండ నిర్ణయం అభినందనీయం. అయితే సరైన కథను ఎంచుకొని పక్కా కథనం ఉన్న సినిమాతో వస్తే కొత్త నటీనటులకు మరింత ప్రయోజనం కలిగి ఉండేదేమో అనిపిస్తుంది. ఏదీ ఏమైనా యూత్‌ టార్గెట్ చేసుకొని చిన్న బడ్జెట్ చిత్రాలతో రావడం సినీ పరిశ్రమకు శుభసూచకం. ఇలాంటి ప్రొత్సాహకర చర్యలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా మారే అవకాశాలున్నాయి. ఇక పరిమిత బడ్జెట్‌లో చక్కటి క్వాలిటీ తీసుకురావడంలో విజయ్ దేవరకొండ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Also READ:   రాజు గారి గది 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
-->

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఓ అబద్ధం ఎలాంటి కష్టాలను తీసుకొస్తుందనే చిన్న పాయింట్‌తో సెల్‌ఫోన్ చుట్టు అల్లుకొన్న కథ మీకు మాత్రమే చెబుతా. యూత్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందించిన కామెడీ చిత్రమని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన బలం. మల్టీ‌ప్లెక్స్, అర్బన్ ఆడియెన్స్‌కు నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఇక బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయమే దక్కవచ్చు.

బలం, బలహీనత

బలం, బలహీనత

నటీనటులు ఫెర్ఫార్మెన్స్

సాంకేతిక అంశాలు

మైనస్ పాయింట్స్

కథ, కథనాలు

కామెడీ పండకపోవడం

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, అవంతికా మిశ్రా, అనసూయ, విజయ్ దేవరకొండ

కథ, దర్శకుడు: షమీర్ సుల్తాన్

నిర్మాత: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ

మ్యూజిక్: శివకుమార్

సినిమాటోగ్రఫి: మథన్ గుణదేవ

ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్

ఆర్ట్: రాజ్ కుమార్

క్యాస్టూమ్స్: లతా తరుణ్ భాస్కర్

బ్యానర్: కింగ్స్ ఆఫ్ హిల్స్

రిలీజ్: 2019-11-01