మిరియాలు ఔషధ ఉపయోగాలు

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:

మిరియాలు ఔషధ ఉపయోగాలు
**************************
ఇవి జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గుమాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి. లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం… జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే… గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. అలాగే.. అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.. మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాతబెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదరంలో వాయువులు ఏర్పడినపున్పడు… కప్పు మజ్జిగలో పావుచెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. కండరాలు, నరాలు.. నొప్పిగా అనిపించినప్పుడు.. చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకోవాలి. దప్పిక తీర్చే…. కఫం అధికంగా ఉన్నవారు.. అధికబరువుతో బాధపడుతున్నవారు.. భోజనానికి గంటముందు అరగ్రాము మిరియాలపొడిని తేనెతో తీసుకుని.. వేడినీళ్లు తాగితే.. గుణం ఉంటుంది. కొందరు అధిక దప్పికతో బాధపడుతుంటారు. ఇలాంటివారు.. కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే.. మంచిది. తరచూ జలుబు, తుమ్ములు వేధిస్తుంటే.. పసుపు, మిరియాలపొడిని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి. చిగుళ్ల వాపు, నోటినుంచి నెత్తురు కారడం.. వంటి సమస్యలు బాధిస్తుంటే.. చిటికెడు రాళ్లఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి.. గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడే వారికి.. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి.. పొడిచేసి నొప్పి ప్రాంతంలో కట్టు కడితే.. నొప్పి, వాపు తగ్గుతుంది. చర్మవ్యాధులు, గాయాలు :మిరియాల పొడిని, నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. గాయలు తగిలినపుడు మిరియాల పొడి పెడితే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తస్రావం ఆగిపోతుంది.

Related:   చింత గింజ‌ల‌ను పారేస్తున్నారా..?

కడుపులో మంట ఉన్నవారు.. వేళకు ఆహారం సక్రమంగా తీసుకోనివారు.. అధిక శరీర వేడి ఉన్నవారు.. మిరియాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మరీ వేడిని పెంచి.. సమస్య తీవ్రమయ్యే ఆస్కారముంటుంది. అందుకే ఈ సూచన. వైద్యుల సలహా ప్రకారం వాడితే.. ఏ ఇబ్బందీ ఉండదు. చిన్నపిల్లలకు పావుచెంచా.. పెద్దవాళ్లు అరచెంచా చొప్పున తీసుకోవచ్చు. మిరియాల పొడి…లాభాలు మరికొన్ని చిట్కాలు : మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు.

కొన్ని రుగ్మతలకుమిరియాలు

దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పుకలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు వైద్యులు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు.

గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

* మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.
* వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది.
* ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.
* మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి.
* వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
* మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది.
* కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది.
* వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.
దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.
* మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
* చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
* ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
* మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

Related:   నెలలో ఒక్కమారు మిరియాల అన్నం తినటం వలన కలుగు ఆరోగ్య ప్రయోజనాలు

Related:   మట్టి పాత్రలో ఇంత టెక్నాలజీ ఉందా?

Read More:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *