pan: Aadhaar, పాన్ నిబంధనలు మారాయ్.. కొత్త రూల్స్ ఇవే! – new aadhaar, pan card rules you need to know

Spread the love
ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారా? పాన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే మీకు మారిన నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పాన్, ఆధార్‌కు సంబంధించి పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

నిర్మలా సీతారమన్ తన తొలి బడ్జెట్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్‌ విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్, ఐటీఆర్ ఫైలింగ్ వంటి వివిధ అంశాలకు సంబంధించి పలు మార్పులను ప్రతిపాదించారు. నల్లధనం నియంత్రణ, డిజిటల్/క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలు ఆధారంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.ఆధార్, పాన్ కొత్త రూల్స్ ఇవే..

Also READ:   Aaj ka taja khabar, आज 1 मार्च के मुख्य समाचार,today breaking news,aaj ka taja smachar gold price

✺ రూ.50,000లకు పైన లావాదేవీలకు ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. బడ్జెట్ అనంతంర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషన్ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. పాన్ కార్డు లేకున్నా కూడా లావాదేవీలను నిర్వహించొచ్చు. ఇప్పటిదాకా రూ.50 వేల పైన ట్రాన్సాక్షన్లకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం ఉండేది. ఈ ప్రాతిపాదన పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, బంగారం కొనుగోలు వంటి వాటికి పాన్ బదులు ఆధార్ సమర్పిస్తే సరిపోతుంది.

✺ బ్యాంకుల్లో రూ.50,000కు పైన నగదు డిపాజిట్ చేయాలన్నా, అలాగే క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలన్నా కూడా త్వరలో ఆధార్ సమర్పిస్తే సరిపోతుంది. పాన్ కార్డు అవసరం ఉండడు. ఇప్పుడు ఆధార్, పాన్ ఇంటర్‌ఛేంజబుల్. అంటే రెండింటిలో ఏది ఉన్నా పని జరిగిపోతుంది.

Also READ:   Aussie Election: A Game of Polls - feat. Julian Assange [RAP NEWS 20]

✺ ఆధార్-పాన్ లింక్: ఆధార్ కార్డు సాయంతో ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్న్స్)ను దాఖలు చేసేవారికి ఇకపై ఐటీ అధికారులే కొత్త పాన్ కార్డును జారీ చేస్తారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర ఈ విషయాన్ని తెలిపారు.

✺ పాన్ కార్డు లేనివారు కూడా ఇకపై ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఆధార్‌తో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ అంశాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

Also READ:   BEST NEWS BLOOPERS 2017

✺ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోకపోయినా కూడా వచ్చే నష్టం ఏమీలేదు. ఆధార్‌తో లింక్ చేసుకోకపోయినా కూడా పాన్ కార్డు డీయాక్టివ్ కాదు. ఆర్థిక కార్యదర్శి ఈ విషయాన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *