నేడు “ప్రదోషము – 29-01-2018

0
98

*నేడు “ప్రదోషము”*

హేవళంబి సంవత్సరం, మాఘ మాసం, సోమవారం (29-01-2018) రోజున ప్రదోషం వస్తోంది. ఈ ప్రదోషం 108 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది. ఇది అద్భుతమైన ప్రదోష కాలం.

*ఈ ప్రదోష మహిమ ఏంటంటే.. శివునికి ప్రీతికరమైన, మహాదేవుని జన్మనక్షత్రంగా పేర్కొనే ”ఆరుద్ర” ఇదే రోజున రావడం. ఈ రోజున సోమవారం, ఆరుద్ర నక్షత్రం, త్రయోదశి మూడు కలిసి రావడంతో శివునిని పూజించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. *

“ప్రదోషో రజనీ ముఖ౦” రజని అ౦టే రాత్రి. రజనీ ముఖ౦ అ౦టే రాత్రికి ప్రార౦భసమయ౦ అని. స౦ధ్యాసమయ౦ పూర్తి అవుతూ రాత్రి వస్తూన్న సమయ౦ ఏదైతే ఉ౦దో దానిని ప్రదోష౦ అ౦టారు. దోష౦ అ౦టే రాత్రి, ప్ర అ౦టే ప్రార౦భదశ. రాత్రికి ప్రార౦భము.

*ప్రతిరోజూ ఒక ప్రదోష౦ వస్తు౦ది. దీనిని నిత్య ప్రదోష౦ అ౦టారు. పూర్ణిమ ము౦దు త్రయోదశి నాటి సాయ౦త్రాన్ని పక్ష ప్రదోష౦ అనీ అమావాస్య ము౦దు త్రయోదశి నాటి సాయ౦త్రాన్ని మాసప్రదోష౦ అనీ అ౦టారు. మహా శివరాత్రిని మహాప్రదోష౦ అ౦టారు.

ప్రదోష కాలమున
(సా: 5.30-7.30)
ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చాలా విశేషము.

“ఓం నమఃశివాయ, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ,
శ్రీ మన్మహాదేవాయ నమః”.
అని చెప్పుకుంటూ ఇంట్లో కూడా ఆ సదాశివునికి జలముతో అభిషేకము చేయవచ్చు. లేక
“ఓం నమఃశివాయ” అనుచూ 108 సార్లు జపము చేసిన మంచిది.

ఈ క్రింది శివభుజంగములోని శ్లోకాన్ని స్తుతించి మంచి ఆరోగ్యమును పొందగలరు.

శిరో దృష్టి హృద్రోగ శూల ప్రమేహ
జ్వరార్శోజరాయక్ష్మహిక్కావిషార్తాన్ |
త్వమాద్యో భిషగ్భేషజం భస్మ శంభో త్వముల్లాఘయాస్మాన్వపుర్లాఘవాయ||

శివప్రదోష స్తోత్రం:

కైలాస శైల భావనేత్రి జగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాటు మభివాంఛిత శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేన భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్ స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడాపతీమ్

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్పర సాంగణాశ్చ

యేన్యేత్రిలోక నిలయస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

?లోకాస్సమస్తా స్సుఖినోభవంతు?

Please View My Other Sites

Also READ:   సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం