పులగం  తయారీ  విధానము

Spread the love

పులగం  తయారీ  విధానము .
ఉపవాసం అంటే  కటిక ఉపవాసం ఏమీ తినకుండా ఉండి కడుపు  మాడ్చుకుని  శోష  వచ్చి పడిపోయి  కొత్త ఆరోగ్య  సమస్యలను సృష్టించుకోవడం  కాదు .
మధ్యాహ్నము  వేళలలో  నీరసపడకుండా  ఆ కాలంలో  పెద్దలందరూ  పులగం  తినే వారు .
చాయపెసరపప్పు తో   కలసిన  ఈ అన్న పదార్ధము  శరీరానికి  అవసరమైన  శక్తిని  ఇస్తుంది .
ఇది  శాస్త్ర  సంబంధితమైన ఉపవాస సమయంలో  తీసుకో తగ్గ ఆహార పదార్ధముగా  పెద్దలు  తెలియ చెప్తారు .
ఈ పులగం  తయారీ విధానము  ఇంచు మించుగా  తమిళనాడు  వారు    ప్రతి రోజు ఉదయపు ఫలహారముగా  చేసుకునే  పొంగల్  ను  పోలి  ఉంటుంది .
ఇక  పులగం  తయారీ  విధానము  గురించి  తెలుసుకుందాం .
పులగం.
కావలసినవి .
బియ్యం —  ఒక గ్లాసు

Also READ:   బెండకాయ మసాలా కూర

చాయపెసరపప్పు  —  పావు గ్లాసు .
ఈ రెండు  కలిపి ఒక గిన్నెలో  పోసుకుని ఒకసారి కడిగి తగినన్ని  నీళ్ళు పోసి   ఒక పావుగంట  సేపు  నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత  స్టౌ మీద పెట్టుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వండుకోవాలి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నెయ్యి వేసుకుని  నెయ్యి బాగా కాగగానే  పది మిరియాలు , అరస్పూను  జీలకర్ర ,  మూడు రెమ్మలు  కరివేపాకు , పది జీడిపప్పు  పలుకులు  వేసి  వేయించుకుని  పోపు వేగగానే  అందులోనే  ఉడికించిన  పులగమన్నము , తగినంత  ఉప్పు వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పులగం  అన్నం  సిద్ధం.
దీనిలోకి  ఆదరువుగా  అయిదు పచ్చిమిర్చి , ఒక కట్ట కొత్తిమీర , ఉసిరి కాయంత చింతపండు , తగినంత  ఉప్పు మరియు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  ఆ తర్వాత ఆ పచ్చడిలో  నేతితో పోపు పెట్టుకుంటారు.

Also READ:   వెజిటబుల్ రైస్

Read More:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *